– గతంలో మనుషులను తొక్కించారు.. ఇప్పుడు పంటలను తొక్కిస్తున్నారు…
– రైతులతో మేం చిల్లర రాజకీయాలు చేయడం లేదు
– అన్నదాతకు అండగా కూటమి పాలన
– వ్యక్తిగత విమర్శలు… పోలీసులపై దాడులు వద్దు
– వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్త వర్క్ ఫ్రమ్ బెంగళూరు అయ్యింది…
– విలేకర్ల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శ
తెనాలి: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది… రైతాంగానికి గతంలో ఎన్నడు లేని విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సూచనలతో పౌరసరఫరాల శాఖ ద్వారా రైతులకు భరోసా కల్పించామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
వ్యవసాయ రంగంలో కోసం అనేక సంస్కరనలను తెచ్చాం. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు ధ్యానం అమ్మకాలకు పడిగాపులు కాశారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా రైతు సూచించిన విధంగా ధాన్యం కొనుగోలు చేసి 24 గంటలు గడవకముందే నగదు ఖాతాల్లో జమజేసి చరిత్ర సృష్టించాం. గత ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టి చేతులు దులుపుకొంటే కూటమి ప్రభుత్వం బకాయిలు మొత్తం చెల్లించాం.
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చిన రైతాంగం నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. గతంలో వైసీపీ ప్రభుత్వం దళారులు పెద్దలు కలిసి రైతాంగాన్ని నష్టం కలిగించి ఇబ్బందులు పెట్టారు. రబీ సీజనులో ఎన్ని సమస్యలు వచ్చిన కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు భరోసా కల్పించే విధంగా ముందుకు వెళ్ళాం. గత వైసీపీ ప్రభుత్వం రైతులను ఏ విధంగా నష్టం చేశారో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
జగన్ సమాజంలో అలజడి సృష్టించి లా అండ్ ఆర్డర్ సమస్యలు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. సమాజంలో పార్టీ అధినేత ఇలా వ్యవహరించటం మంచిది కాదు. కూటమి ప్రభుత్వం పై వైసీపీ పార్టీ దుష్ప్రచారం మానుకోవాలి.
ఎన్ని కష్టాలు ఉన్నా రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకూడదని నూతన టెక్నాలజీ నీ ఉపయోగించి ఆదుకుంటున్నాం. ఈ రోజు ధాన్యం కొనుగోలు చేసిన 30 వేల మంది రైతులకు 650 కోట్ల రూపాయలను విడుదల చేశాం. 40 రోజులు ఆలస్యం అయినందుకు క్షమించాలి… మరొకసారి ఆలస్యం అవ్వకుండా చూస్తాం.
మేం ఎప్పుడూ రైతుల దగ్గర చిల్లర రాజకీయాలు చెయ్యలేదు. 5 ట్రాక్టర్లు దొంగ చాటుగా తీసుకొచ్చి రైతు పండించిన పంటను దుర్మార్గంగా ఫోటోలు, విడియోల కోసం తొక్కించారు. ఎవరి పైసాచిహక ఆనందం కోసం పంటను తొక్కించారు. గతంలో మనుషులను తొక్కించారు ఇప్పుడు పంటలను తొక్కిస్తున్నారు. రైతుల పట్ల నిజాయితీగా మాట్లాడేటట్టు అయితే చర్చకు రండి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. వ్యక్తిగత విమర్శలు.
పోలీసులపై దాడులు మానుకోవాలి. ఎస్పీ స్థాయి అధికారులను డీఎస్పీ అధికారులను బెదిరించి కాళ్ళు చేతులు తీస్తాం.. ఇదా సమాజానికి మీరు ఇచ్చే సందేశం? రైతులతో నేరుగా మాట్లాడే ధైర్యం లేదు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు ఉంటే అసెంబ్లీలో ప్రస్తావించాలి గానీ ఇదేమీ పరామర్శలు? వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్త వర్క్ ఫ్రమ్ బెంగళూరు అయ్యింది. ప్రజలను రైతులను, మహిళలను రక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకొని చట్ట వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం.