– ఏ ఒక్కరూ ఉద్యోగ, ఉపాధి లేమితో ఉండకూడదు
– ఇదే సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన
– మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అమరావతి: నర్సింగ్, జీఎన్ఎం చదివిన ఎస్సీ నిరుద్యోగ యువతకు జర్మనీ భాషలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ యువతకు ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
నర్సింగ్, జీఎన్ఎం చదివిన ఎస్సీ యువతకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మనీ భాషలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం. మొదటి విడతలో 150 మందికి శిక్షణ ఇచ్చి అనంతరం వారికి జర్మనీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎస్సిల్లో చదువుకున్న ఏ ఒక్కరూ ఉద్యోగ,ఉపాధి లేమితో ఉండకూడదన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఎస్సీలకు ఆర్థికంగా, రాజకీయంగా సామాజికంగా మరింత బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు పాటుపడుతున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.