– ‘సుపరిపాలన తొలిఅడుగు’లో ప్రజల మనోభావాలు తెలుస్తున్నాయి…
– అందరూ పథకాలు పొంది, సంతోషంగా ఉన్నారు…
– ఇంటింటికీ వెళుతుంటే అప్యాయంగా పలకరిస్తున్నారు…
– నెల్లూరు పర్యటనలో మంత్రి నారాయణ
నెల్లూరు: ప్రజల ఆనందానికి అవధులు లేవు… సుపరిపాలన తొలిఅడుగుకు ఎక్కడికి వెళ్లినా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి పార్టీలకతీతంగా లబ్ధి చేకూరిందని చెప్పారు.. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా ఉన్నామని సంతోషంగా చెప్పారని మంత్రి నారాయణ చెప్పారు. ఈ మేరకు ఆయన శనివారం 46, 50వ డివిజన్ల లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
చంద్రబాబు నాయుడి పరిపాలన చాలా బాగుందని కితాబునిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మాటమీద నిలబడ్డ ప్రభుత్వం మాది. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. తల్లికి వందనం చెప్పిన ప్రకారం అమలు చేశాం. మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేయబోతున్నాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20 వేలు అమలు చేయబోతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధ, వికలాంగ, వితంతు, ఒంటరి, డయాలసిస్ పెన్షన్ లు పెంచి ఇస్తున్నామని తెలిపారు.
పన్నులు గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు కట్టేందుకే సరిపోతున్నాయి.. సీఎం చంద్రబాబు నాయుడు కున్న అపార అనుభవంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి.. జగన్ ప్రభుత్వం అన్నకాంటీన్లను మూసేసి రెండులక్షల మంది పేదల కడుపు కొట్టింది. అభివృద్ధిని ఎక్కడికక్కడ నిలిపేసింది. ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభిస్తున్నాం.. నెల్లూరు కటారి పాలెంలో పేదలకోసం చేపట్టిన కమ్యూనిటీ హల్ పనులు ఆపేశారు.
ఆరునెలల్లో కమ్యూనిటీ హల్ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తా… నెల్లూరులో 50 కోట్లతో డ్రైన్లు, కాలువల పనులకు శ్రీకారం చుట్టబోతున్నాం. హామీలన్నీ వందశాతం నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ, మాజీ జెడ్పిటీసీ విజేతా రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ మహేంద్రా రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కపిర శ్రీనివాస్, సత్యనాగేశ్వర రావు, కో క్లస్టర్ ఖాదర్ బాషా, టీడీపీ మహిళా నాయకురాలు, కపిర రేవతి, తదితరులు పాల్గొన్నారు.