న్యూఢిల్లీ: గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్‌గజపతిరాజు నియమితులయ్యారు. మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్, గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తాలను కేంద్రం నియమించింది.
ఊహించలేదు: అశోక్ గజపతి రాజు
గోవా గవర్నర్ పదవి వస్తుందని ఊహించలేదు. బాధ్యతగా పనిచేయడమే నా సిద్ధాంతం. మోదీతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలి. ఎలా పని చేయాలో రాజ్యాంగ నిర్మాతలు దిశానిర్దేశం చేశారు. కలిసికట్టుగా పనిచేస్తే భావితరాలకు మంచి దేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది.
దేశంలో అన్ని ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలి. దేశానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తాను అని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.