– ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
శ్రీరామపురం: 2019-24 మధ్య బాస్ ఎవరు..? మన అమాయకపు బిడ్డ జగనన్నే.. ఇక జగన్ రెడ్డి వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. అని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం వెంకటాచలం మండలం శ్రీరామపురంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన పాపాలు ఇంకా కనిపిస్తునే ఉన్నాయి. ప్రభుత్వ భూముల రికార్డులను అడ్డంగా మార్చేశారు..రీసర్వే పేరుతో రైతులను నిండా ముంచేశారని ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకే చాలా సమయం పడుతోంది. ఐదేళ్లూ అరాచకాలు చేసి ఇప్పుడు ప్రజల కోసం బతికానని అమాయక బిడ్డ జగన్ రెడ్డి సూక్తులు చెబుతున్నాడు. కేవలం డబ్బు కోసం బతికి ప్రజల ప్రాణాలు తీశాడు. లిక్కర్ స్కామ్ రూ.3200 కోట్లలో రూ.2900 కోట్లు బాస్ కి చేరిందని తేలిపోయింది. జే బ్రాండ్ నాసిరకం మద్యం తాగి ఐదేళ్లలో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు..లక్షల మంది మంచం పాలయ్యారు.
2019-24 మధ్య రాష్ట్రంలో బాస్ ఎవరు..మన జగనన్నే.. మీ బిడ్డ మీ బిడ్డ అంటూ జనాన్ని ముంచిన పెద్ద మనిషి ఈ రోజు సూక్తులు చెప్పడం విడ్డూరంగా ఉంది.. ఆయన చాలా పద్ధతిగా బతికారంట..ఇప్పుడు కేసులు పెడుతున్నారంట.
జగన్ రెడ్డి పాలనలో అక్రమ కేసులు, అన్యాయపు అరెస్టులకు అంతే లేదు. ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు నుంచి నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు గా ఉన్న ఎందరో నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారో గుర్తు లేదా? వల్లభనేని వంశీ, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తులు అమాయకులా?
జగన్ రెడ్డి బెదిరింపులకు ఇక్కడ బయపడేవారు ఎవరూ లేరు? ఇక జగన్ రెడ్డి వచ్చేది లేదు.. సచ్చేది లేదు…ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వ పాలనే కొనసాగుతుంది.