– ప్రభుత్వానికి రూ. 4 కోట్ల విలువైన స్థలం అప్పగింత
– అక్కడ వ్యవసాయ పనులు చేపట్టాలని బృందం విజ్ఞప్తి
హైదరాబాద్: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రితో పలు అంశాలపై రైతు కమిషన్ బృందం చర్చించింది.
యాచారంలోని రెండు వేల గజాల తన సొంత భూమిని వ్యవసాయ శాఖకు ఇస్తున్నట్టు మంత్రికి చైర్మన్ కోదండరెడ్డి లేఖ రాసిన ఇచ్చారు. ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ. నాలుగు కోట్లకు పైగానే ఉంటుంది.
ఆ భూమిలో వ్యవసాయ రైతులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టి వాడుకోవాలని చైర్మన్ కోరారు. అదే విధంగా యాచారం మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ ను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని, యాచారం బస్టాండ్ పక్కనే స్థలం అందుబాటులో ఉందని, దాన్ని భూసేకరణ కింద చేయాలని కమిషన్ బృందం విజ్ఞప్తి చేసింది.