– గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీ ఉద్యోగుల పైసలు వాడుకున్న పరిస్థితి
– ఇప్పుడు వారి డబ్బులు చెల్లిస్తున్నాం
– తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 6680 కోట్ల రూపాయలు ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా ఎంజిబీఎస్లో మహా లక్ష్మి సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: 200 కోట్ల మహిళా ఉచిత ప్రయాణం పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన డిసెంబర్ 9,2023 ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శాసన సభ వేదిక మహా లక్ష్మి పథకం ప్రారంభించుకున్నాం. ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్నాం. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన ఆర్టీసీ డ్రైవర్,కండక్టర్లకు అభినందనలు.
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎక్కడికి వెళ్లాలన్న ఉచితంగా వెళ్తున్నారు. ఉచిత బస్సు వల్ల మహిళలు అవకాశాలు ఉపయించుకుంటున్నారు. ఉద్యోగాలు , దేవాలయాలు, షాపింగ్ లకు ఎక్కడికి వెళ్లాలన్న ఉచిత ప్రయాణం ఉపయోగించుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీ నీ నిర్వీర్యం చేశారు. ఆర్టీసీ ఉంటుందా అని కూడా అనుకునే పరిస్థితి ఉండేది.
ఇప్పుడు ఆర్టీసీ నష్టాల నుండి లాభాల్లోకి వస్తుంది. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం.నియామకాలు చేస్తున్నా. గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీ ఉద్యోగుల పైసలు వాడుకున్న పరిస్థితి. ఇప్పుడు వారి డబ్బులు చెల్లిస్తున్నాం. సంస్థ పరిరక్షణ ప్రయాణికుల సౌకర్యం ఉద్యోగుల సంక్షేమం నినాదంతో ఆర్టీసీ ముందుకు పోతుంది.
ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం తో పాటు బస్సులకు యజమానులకు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు బస్సులు కొనుగోలు చేసింది.ఇటీవల 150 బస్సులకి కోటి రూపాయల చెక్కులు కూడా అందజేసాము. గతంలో 45 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఆర్థిక విధ్వంసం తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆర్టీసీ కి ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా ఉంటుంది.
ఈరోజు 97 బస్సు డిపోలు 324 బస్ స్టేషన లలో, 200 కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలు 6680 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు నిర్వహిస్తున్నాం.
ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,ఆర్టీసీ ఎండీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఇతర అధికారులు
పాల్గొన్నారు.