– రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల రాజకీయ అక్రమ సంబంధం నిస్సిగ్గుగా నడుస్తుంది
– బీజేపీ ఎంపీకి వందల కోట్ల కాంట్రాక్టును రేవంత్ కట్టబెడుతుంటే రాహుల్ గాంధీ కండ్లు మూసుకున్నాడు
– బిజెపి నేతలతో రేవంత్ కుమ్మక్కు అవుతున్న సంగతి రాహుల్ గాంధీకి కనిపించడం లేదా ?
– సోనియాగాంధీ రాసిన ఉత్తరంలో ఏముందో కూడా చదవడం రాని రేవంత్ రెడ్డి, అదే తనకు అస్కార్ అవార్డు అన్న వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు
– రేవంత్ డిగ్రీ ఫేక్ కావొచ్చని అనుమానం వ్యక్తం చేసిన కేటీఆర్
– తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ ను బిఆర్ఎస్విలో విలీనం చేసే కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం విషయంలో రేవంత్ రెడ్డి కి సపోర్ట్ చేసి కమీషన్లు ఇప్పిచ్చిన బిజెపి ఎంపీ సీఎం రమేష్ కి క్విడ్ ప్రో కో కింద 1600 కోట్ల రూపాయల ఫోర్త్ సిటీ రోడ్డు కాంట్రాక్టును ఎలా ఇప్పించారు? సోనియాగాంధీ రాసిన ఉత్తరంలో ఏముందో చదవడం రాక మురిసిపోతున్న రేవంత్ రెడ్డికి, అస్కార్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు.
కార్యక్రమానికి రాలేనని సోనియా గాంధీ చెప్పిన మాటను అర్థం చేసుకోలేక తనను ప్రశంసించిందని మురిసిపోతున్న రేవంత్ రెడ్డిని చూస్తే జాలేస్తుందన్నారు. సోనియా గాంధీ రాసిన లేఖను కూడా చదివే తెలివి రేవంత్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని మాట మాత్రంగానైనా ప్రశంసించని సోనియాగాంధీ లేఖను చూసిన ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి అజ్ఞానాన్ని, దీనస్థితిని చూసి నవ్వుకుంటున్నారన్నారు. సోనియాగాంధీ లెటర్ ను కూడా చదవలేని రేవంత్ రెడ్డికి దొంగ డిగ్రీ ఉందేమోనని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.
తెలంగాణను అడ్డగోలుగా దోచుకుంటున్న రేవంత్ రెడ్డిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాపాడుతుందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో ఆర్.ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధానమంత్రి విమర్శించి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటిదాకా కేంద్రం స్పందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలాగా మారిందని చెపుతున్న అమిత్ షా… కేంద్ర హోంమంత్రిగా ఉండి ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని నిరూపించే సాక్ష్యాలను కేంద్రప్రభుత్వానికి ఇచ్చినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆ పార్టీలు నిస్సిగ్గుగా సాగిస్తున్న అక్రమ సంబంధానికి తిరుగులేని సాక్ష్యం అన్నారు. రేవంత్ రెడ్డికి బిజెపి కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉంటే ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజల మద్దతు ఏమాత్రం లేదన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం విషయంలో రేవంత్ రెడ్డి కి సపోర్ట్ చేసి కమీషన్లు ఇప్పిచ్చిన బిజెపి ఎంపీ సీఎం రమేష్ కి క్విడ్ ప్రో కో కింద 1600 కోట్ల రూపాయల ఫోర్త్ సిటీ రోడ్డు కాంట్రాక్టును అప్పజెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.
బిజెపి ఎంపీ కి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందల కొద్ది కాంట్రాక్టులు ఇస్తుంటే రాహుల్ గాంధీ మౌనం వహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి బిజెపి నేతలతో కుమ్మక్కు అవుతున్న సంగతి రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు
కాంగ్రెస్ వాళ్లకి నల్లమల్ల పిల్లి ఉంటే ,మాకు నల్గొండ పులి జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ నల్లమల్ల పిల్లికి నల్లమల్ల ఎక్కడుందో కూడా తెలియదు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో దళిత బిడ్డ సాయిలును రేవంత్ రెడ్డి పోలీసులు ఎక్కడ అవమానించారో, అక్కడనే ఇవాళ మేమందరం ఆయనకు సన్మానం చేసి అధికారులకు ఓ హెచ్చరిక చేశారు.
చరిత్ర ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు చేసిన పోరాటాలను ఎవరు మరిచిపోరు. విద్యార్థి అమరవీరుల బలిదానాలను తెలంగాణ ఉన్నంతకాలం చెప్పుకుంటారు. ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీయూనివర్సిటీలో విద్యార్థులు చేసిన మహోన్నత పోరాటాల ఫలితం గానే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గడగడలాడి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది.
కెసిఆర్ పూర్వ నల్గొండ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు మూడు నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి , కోదాడ తో పాటు చివరి ప్రాంతాలకు కూడా కాళేశ్వరంతో కేసీఆర్ నీళ్లు ఇచ్చారు.
ఫ్లోరైడ్ మహమ్మారితో ఉమ్మడి నల్గొండ జిల్లా నరకయాతన అనుభవించింది. ఎందరో ప్రధాన మంత్రులు, మరెందరో ముఖ్యమంత్రులు చేయలేని పనిని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ రక్కసిని రూపుమాపి ఉమ్మడి నల్గొండ జిల్లాకు శాప విముక్తి చేశారు. కెసిఆర్ ఏం చేసిండని అడిగే సన్నాసులకు ఆయన చేసిన పనులను ఎంత సేపైనా చెప్పవచ్చు.
ఒక్క విద్యార్థి మీద సంవత్సరానికి లక్ష 20 వేల రూపాయలను ఖర్చుపెట్టి ఆరున్నర లక్షల మంది పిల్లలను ప్రపంచంతో పోటీపడే పౌరులుగా కేసీఆర్ ప్రభుత్వం తీర్చిదిద్దింది. అబద్దాల ముందు అప్పుడప్పుడు నిజాలు ఓడిపోతాయి. తెలంగాణలో అదే జరిగింది. రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలకు తెలంగాణ ప్రజలు మోసపోయారు. ఈ శతాబ్ద పాతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో.
విద్యార్థులకు ఐదు లక్షలతో విద్యా భరోసా కార్డును ఇస్తామన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. పీహెచ్డీ చేసే విద్యార్థులకు 5లక్షలు, మాస్టర్స్ చేసే విద్యార్థులకు మూడు లక్షలు, డిగ్రీ చదివే విద్యార్థులకు, రెండు లక్షలు ఇస్తామని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన కూతలు కూసీ ఇప్పుడు వాటి గురించి మాట్లాడడమే లేదు.