– సింగపూర్లో తెలుగుమహిళతో చంద్రబాబు చలోక్తి
మనం మనసులో దాచుకున్న, కానీ అడగలేని ప్రశ్నను.. సింగపూర్లో ఓ మహిళ ధైర్యంగా అడిగింది. ఆ ప్రశ్న ఎంతోమంది ప్రవాసాంధ్రులు, మాతృభూమిలోని సామాన్యుల గుండెల్లో మెదిలేదే!
ఆమె ప్రశ్న వినగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఓర్పుగా, లోతుగా సమాధానమిచ్చారు. సింగపూర్ గడ్డపై సాగిన తెలుగు డయాస్పోరా సమావేశం, కేవలం పెట్టుబడులు, అభివృద్ధి ప్రణాళికల గురించే కాదు.. ఆ ప్రశ్న తరువాత.. భావోద్వేగాల ప్రవాహానికి వేదికైంది.
లక్షలాది మంది తెలుగువారు ఎన్నో ఏళ్లుగా ఆయనకు నేరుగా కృతజ్ఞతను చెప్పాలని నిరీక్షిస్తున్నారు. ఆమెకు ఆ అవకాశం, అదృష్టం దక్కేసరికి, ఆమె భావోద్వేగం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గుండెలను తాకింది.
గర్వపడాల్సిన సమయంలోనూ, ఆయన ఆమె భావోద్వేగాన్ని సున్నితంగా బ్యాలెన్స్ చేస్తూ, “నాకు డబ్బులివ్వడం లేదమ్మా నువ్వు” అంటూ చమత్కరించారు. ఆ మాటలతో సభా ప్రాంగణం నవ్వులతో నిండిపోయింది, వాతావరణం తేలికపడింది. స్థితప్రజ్ఞుడులోని సహజత్వం, సామాన్యులతోనూ ఆయన ఎలా కలిసిపోతారో మరోసారి స్పష్టమైంది.
విదేశీ గడ్డపై ఉన్నప్పటికీ, ఆయన ధ్యాసంతా ఆంధ్రాలోని పేదలపైనే ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన మాటల్లో, ఆశయాల్లో.. ‘పి4 (పబ్లిక్-ప్రైవేట్-పార్ట్నర్షిప్-పీపుల్)’ కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, దానిని ప్రపంచ వ్యాప్తంగా ఒక ఉద్యమంలా తీసుకెళ్లాలనే తపన కనిపించింది.
ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడి కన్నీరు తుడిచి, పేదరికాన్ని చరిత్ర పుటల నుండి పూర్తిగా రూపేమాపే కసితో ఆయన ఉన్నారని స్పష్టమైంది. తన మీద అభిమానం ఉంటే, పేదవారికి సాయం చేయమని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇలా అడిగే అరుదైన నాయకుడు ఈయనేనేమో!
-చాకిరేవు