సీఎం చంద్రబాబు నాయుడి సింగపూర్ పర్యటన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో జరిగిన కీలక సమావేశంలో, రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి.
భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే మాట్లాడుతూ..సింగపూర్ అద్భుత ప్రగతిని, బలమైన ఆర్థిక విధానాలు, భారత్తో ఆ దేశానికి ఉన్న బలమైన సంబంధాలను బృందానికి వివరించారు. ముఖ్యంగా ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమికండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాలు వంటి కీలక రంగాల్లో సింగపూర్ విధానాలను స్పష్టం చేశారు.
ఒక గొప్ప శుభవార్త ఏమిటంటే, సింగపూర్ సంస్థలు భారత్, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి తీవ్ర ఆసక్తి చూపుతున్నాయని హైకమిషనర్ వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం, సింగపూర్ ప్రభుత్వంలో, స్థానిక పారిశ్రామిక వర్గాల్లో ‘సీబీఎన్ బ్రాండ్’కు ఉన్న ప్రత్యేక గుర్తింపు అని ఆయన నొక్కి చెప్పారు. మంత్రులు పి. నారాయణ, నారా లోకేష్, టిజి భరత్ సహా ఉన్నతాధికారుల బృందం ఈ సమావేశంలో పాల్గొంది.