• ఆల్ఫ్స్ పర్వతాలలో సేదతీరటం కాదా?
• జగన్ రెడ్డి అసమర్థ పాలన వలన దేశంలో ముందు ఉండాల్సిన రాష్ట్రం వెనుక బడిపోయింది
• గత ఐదేళ్ల జగన్ పాలననలో కొత్త కంపెనీలను తీసుకు రాకపోగా ఉన్న కంపెనీలను కూడా తరిమికొట్టారు
• నేడు వివిధ పాలసీలతో రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షిస్తుంటే వైసీపీ నేతలకు కడుపు మండుతుంది
• ఈజ్ ఆఫ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ బిజినెస్ కు వచ్చాం
• నాడు పరిశ్రమల మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఏం కంపెనీ తెచ్చావంటే నోరు మెదపడు
• పచ్చళ్లు, అప్పడాలు, బొప్పట్ల కంపెనీలకోసం ప్రయత్నించిన ఈ వ్యక్తికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి తెలిస్తే కదా?
• గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పారిశ్రామీకరణ అనే పదమే వినిపించలేదు
– బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్
కోడి గుడ్లు పెట్టిన వెంటనే పొదుగుతుందా అని ప్రశ్నించిన నాటి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను గత ఐదేళ్ల పాలనలో తెచ్చిన కంపెనీలు ఏంటని ప్రశ్నిస్తే మాత్రం నోరు మెదపడు.. అసలు గత ఐదేళ్లు పారిశ్రామీకరణ అనే పదమే వినిపించలేదు. నాడు పెట్టుబడులకోసం దావోస్ కు వెళ్లిన జగన్ రెడ్డి చేసింది ఏమిటి? ఆల్ఫ్స్ పర్వతాల్లో సేదతీరటం కాదా?
రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాకపోగా.. ఉన్న కంపెనీలను కూడా తరమి కొట్టి.. దేశంలో ముందుండాల్సిన రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన చరిత్ర వైసీపీది అని బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పారిశ్రామిక వేత్తలు నేడు సీబీఎన్ అనే బ్రాండ్ చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారు. గత ఐదేళ్ల జగన్ రెడ్డి అసమర్థ పాలనతో దేశంలో ముందు ఉండాల్సిన రాష్ట్రం కేవలం రూ. 6,800 కోట్ల ఎఫ్డీఐతో అట్టడుగు స్థాయికి చేరింది. ఐబీఎమ్, అశోక్ లైల్యాండ్, ఫిన్ టెక్, లూలూ వంటి అనే కంపెనీలు జగన్ పాలనలో రాష్ట్రాన్ని వీడి పారిపోయాయి. భూ కేటాయింపులపై వైసీపీ నేతలు చేస్తున్న అబద్దాలకు సమాధానం చెప్పకుంటే.. ప్రజలు నిజం అనుకుంటారు.
గత సంవత్సరకాలంగా మేము కేటాయించిన ప్రతి భూ కేటాయింపుకు ఒక పాలసీ ఉంది. క్యాబినేట్ లో చర్చించి అనుమతించాకే భూ కేటాయింపు పాలసీని అమలు చేస్తున్నాం. ఆర్థికంగా దివాళా తీసిన రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించడానికి రక రకాల పాలసీలు కావాలి. సౌకర్యాలు కల్పించి పరిశ్రమల నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు వస్తే.. గతంలో మీరు చేసింది ఏంటి. మేము చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేపర్లను సెంట్రల్ గవర్నమెంట్ కు చూపించడం కాదా?
ఈ పాలసీలను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. కంపెనీల ఏర్పాటుకోసం అందుకే తక్కువ ధరలకు భూములు ఇస్తున్నాం. మీ మాదిరి పనికిమాలిన సమ్మిట్ లు పెట్టి పనికిమాలిన పనులు చేయడంలేదు. ప్రోత్సాహకాలు ఇస్తేనే కంపెనీలు వస్తాయి. మనం ఇవ్వకపోతే మరో రాష్ట్రం ఇస్తుంది. కంపెనీలు అక్కడికి వెళ్తాయి. గత ఐదేళ్లు 70 నుండి 80 శాతం గ్రోత్ తో దేశం ముందుకు వెళ్తుంటే.. మీ పాలనలో రాష్ట్రం ఎందుకు వెనుకబడిపోయింది.. ఎందుకు ఎప్డీఐలు రాలేదు?
పచ్చళ్లు, అప్పడాలు, బొబ్బట్ల కంపెనీలకోసం ట్రై చేసిన అమర్నాథ్ కు ఇలాంటివి అస్సలు తెలియదు. నేటి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన కోసం స్కిల్ డవలప్ మెంట్ సెంటర్లల ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రొసెసింగ్, క్లీన్ ఎనర్జీ వంటి అనేక పాలసీలను ప్రకటించాం… కావాలంటే వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.
ఇన్ని ఇస్తున్నాం కాబట్టే ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన గూగుల్, టీసీఎస్, ఆర్సెల్లార్ మిట్టల్ లాంటి గొప్ప గొప్ప కంపెనీలు ఏపీకి వస్తున్నాయి. 9 లక్షల 50 వేల కోట్లు ఎంఓయూలు కుదుర్చుకున్నాం. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉర్షా డేటా సెంటర్ కు ఎకరా రూ. 50 లక్షలకు ఇచ్చాం. టీసీఎస్ కు మాత్రమే రూ. 99 పైసలకు ఇచ్చాం.
మీ పాలనలలో అశోక్ లేలాండ్ లాంటి ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయాయి… ఒక్క రోజైనా మీరు వారి వద్దకు వెళ్లి ఎందుకు వెళ్తున్నారు అని అడిగారా? నేడు మేము అధికారంలోకి వచ్చాక అశోక్ లేలాండ్ పక్క రాష్ట్రాల్లో తయారు చేస్తున్న బస్సులకు ఇక్కడ బాడీలు కడుతున్నారు. ఎముకలు గడ్డ కట్టే చలిలో కూడా వందల మంది పారిశ్రామిక వేత్తలో మీటింగ్ లు పెట్టి.. 163 కంపెనీలతో ఎంఓయులు కుదుర్చుకున్నారు మా నేత. రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలంటే భూములు ఇవ్వాలి.. భూములు ఇవ్వకుంటే పరిశ్రమలు ఎక్కడ పెడతారు?
మీ ఐదేళ్ల పాలనలో మీరు తెచ్చిన ఒక్క పెద్ద కంపెనీ పేరు చెప్పండి.? దొంగ సోలార్ ఒప్పందాలు కాకుండా ఎన్ని ఎంఓయూలు చేసుకున్నారో చెప్పండి? వైజాగ్ లో చేసుకున్న సోలార్ ఎంఓయూలలో మీ వాటా క్రింద డబ్బులు తీసుకుంది వాస్తవం కాదా? లూలూపై గుడివాడ అమర్నాథ్ బుర్రలేకుండా మాట్లాడుతున్నాడు. మాల్స్ ఎవరైనా టౌన్ లో కడతారా ఊరు బయటకు కడతారా?
ఐదు వేల కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ను శ్రీ సిటీలో మంత్రి లోకేష్ బాబు ఓపెన్ చేశారు. ఇది మీ కళ్లకు కనిపించలేదా? నాయుడు పేటలో రూ. 3,700 కోట్లతో ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ ను ఏర్పాటు చేయబోతున్నారు, కోరమాండల్ సిమెంట్ రూ. 1,539 కోట్లతో 750 మందికి ఉద్యోగాలతో కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారు. వరుణ్ హస్పటాలిటీ వైజగ్ లో శంకుస్థాపన చేశారు. ఓర్వకల్లులో రిలయన్స్ కన్జూమర్ ప్రోడెక్ట్ , మధురవాడలో యూనిటీ మాల్ ను దేశ ప్రధాని మంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.
బ్లూ స్టార్, రాంకో సిమెంట్స్, రైమాన్స్ వంటి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి.. ఇవి మీ కళ్లకు కనిపించడంలేదా? మీ ఐదేళ్ల పాలనలో ఇన్ని కంపెనీల పేర్లైనా చదివారా? ఇంక ఏమి మాట్లాడుతారు? మీకు తెలిసింది ఒక్కటే ఏడుపుగొట్టుతనం.. మీరు చేయలేరు. పక్కన వారు చేస్తుంటే ఓర్చుకోలేరు. అమరావతి దేశంలోనే క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా మారుతోంది.
దీనికోసం ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. 2026 జనవరి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఇది వైసీపీ నేతలకు కనిపించడంలేదా? ఇకనైనా వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు మానుకొవాలి. చేయడం చేతగాక పనులు చేసే వారిపై విమర్శలు చేయడం మీ దగుల్బాజీ తనానికి నిదర్శనం అని చెప్పాలి.