తెలుగు వెండితెరమీద
నక్షత్రంలా మెరిసాడు
చిత్ర సుందరి నుదుట
సిందూరం ని దిద్దాడు
తొలి సినిమా గులాబీతో
దర్శకుడిగా గుబాళించాడు
విలక్షణమైన హృదయము
కొత్తదనమున్న కృష్ణ వంశీ…!
ఖడ్గం లాంటి అంత : పురాన్ని వీడి
జన సముద్రంలోకి వచ్చాడు..రామ్
గోపాల్ వర్మ వద్ద చక్రాన్ని తిప్పాడు
శక్తివంతమైన తెలుగు సినిమాలో
తాను మురారిగా మారి… సినిమా
చందమామను అందుకున్నాడు
జీవితాశయాన్ని నెరవేర్చుకున్నాడు..!
చంద్రలేఖ సోయగాలను కాంచి
యమ డేంజర్ లో పడిన.. మహాత్మ
పైసా లేకుండా.. నిన్నే పెళ్లాడతానని
మహాలక్ష్మీ రమ్యకృష్ణ… వెంట పడి
శశిరేఖ పరిణయమాడిన కృష్ణ వంశీ
సినిమాలో కాస్త … విశ్రాంతి వచ్చినా
ఆయన నుంచి… మంచి చిత్రాలు రావాలి మరెన్నో…!
– జి.సూర్యనారాయణ,6281725659