– ఎఐపిఅర్పిఎ రాష్ట్ర కార్యదర్శి నిమ్మగడ్డ
గుంటూరు: విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి అండగా వుండి, వారిని కంటికి రెప్పలా కాపాడాలని ఆలిండియా పోస్టల్, అర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ నాగేశ్వరరావు సిజిహెచ్ఎస్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విద్యకు విన్నవించారు.
నగరంపాలెం లోని కేంద్ర ఆరోగ్య పథకం ( సిజిహెచ్ఎస్ ) కార్యాలయంలో సోమవారం ఆయన డాక్టర్ విద్యను కలిసి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సేవ, అంకితభావం అందించాలని కోరారు. ప్రతి విశ్రాంత ఉద్యోగి వైద్య చరిత్ర ను పరిశీలించి, వారి ఆరోగ్యంపై పూర్తి అవగాహన ఉంచాలన్నారు.
డాక్టర్ వి. విద్య మాట్లాడుతూ.. వైద్యునిగా పెన్షనర్లకు సానుభూతి, మద్దతు అందిస్తానన్నారు. ఆరోగ్యపరంగా వారి బాగోగులు చూడటం డాక్టరుగా తన కర్తవ్యమన్నారు. రోగుల విశ్వాసాన్ని వమ్ము చేయనన్నారు.
తొలుత నూతన బాధ్యతలు చేపట్టిన డాక్టర్ విద్యకు నిమ్మగడ్డ నాగేశ్వరరావు అసోసియేషన్ తరుపున పుష్పగుచ్చం అందించారు. డాక్టర్ విద్యను కలిసిన వారిలో సంఘం ఉపాధ్యక్షులు సి.హెచ్.కోటేశ్వరరావు, సి.హెచ్. విద్యాసాగర్ వున్నారు.