– మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలు కబ్జా కు గురి కాకుండా కాపాడడంతో పాటు కబ్జాకు గురైన వాటికి కూడా న్యాయపరంగా పోరాటం చేసి.. ప్రభుత్వం వైపు తీసుకునే విధానంలో ఎసిపి కార్యాలయం ఎదురుగా బంజారాహిల్స్ లో స్థలాన్ని కొంతమంది భూకబ్జా దారుల నుండి ప్రభుత్వం ఇటీవల స్వాధీనం చేసుకుంది.
న్యాయపరంగా ఆ భూమి పై గెలిచి దాని చుట్టూ పెన్సింగ్ వేయడం జరిగింది. అది ప్రభుత్వ అవసరాలకు దానిని ఎలా వినియోగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇంతలో దేవుడి పేరు మీద మాత్రమే ఓట్లు అడిగే వారు అక్కడ రాద్దాంతం చేస్తున్నారు. మా ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం.
దేవుని ఆలయం నిర్మాణం కోసం అడుగుతున్నరో ప్రభుత్వానికి అప్లికేషన్ పెడితే, వీలైతే దేవాలయానికి ఎక్కడైనా స్థలాన్ని కేటాయించడానికి ఎవరికి ఇబ్బంది లేదు.మాది సెక్యులర్ ప్రభుత్వం దేవాలయం తీసుకుపోయి ప్రభుత్వ స్థలంలో పెట్టీ వివాదం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలం ప్రజా అవసరాల కోసం ఉపయోగించే విధానం.
జూబ్లీహిల్స్ లో తిరుమల దేవాలయానికి స్థలం ప్రభుత్వమే ఇచ్చింది. చాలా స్థలాల్లో దేవాలయాలకు ప్రభుత్వమే స్థలాలు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇస్తాం.భూకబ్జా దారుల నుండి తీసుకున్న స్థలాన్ని దేవాలయాల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం మానుకోవాలి. కమ్యునల్ పాలిటిక్స్ వద్దు. దేవాలయాల నిర్మాణానికి మీరు సొంతగా ఎన్ని పైసలు ఇచ్చి చేస్తారో చేసుకోండి.
అంతేగాని ప్రభుత్వం స్థలంలో పెట్టి దానిని రాద్దాంతం చేయవద్దు. మా హుస్నాబాద్ నియోజకవర్గంలో, తిరుమల దేవాలయానికి కూడా 10 ఎకరాలు స్థలం ఇచ్చాం. ఎవరైనా గుడి నిర్మాణం చేయాలనుకుంటే ప్రభుత్వం స్థలం పరిశీలిస్తాం. మందిరం ,గుడి ,చర్చి ఏదైనా ప్రభుత్వ స్థలాల్లో వద్దు. అందరినీ గౌరవించాలి.సెక్యులర్ దేశం.