– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
పుట్టపర్తి: వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారాన్ని ఆర్థిక దోపిడీకి మారుపేరుగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో లిక్కర్ స్కాం కు గ్రామం నుంచి రాష్ట్ర రాజధాని వరకు అందరికీ తెలుసు. ఇదేదో సి బి సి ఐ డి , ప్రత్యేక దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల సొమ్ము దోచుకుని అడ్డంగా దొరికిపోయారన్నారు. ఈ మేరకు ఆయన ఇక్కడి విలేఖర్లతో గురువారం మాట్లాడారు.
లిక్కర్ స్కాం పేరిట ప్రజల సొమ్మును అడ్డుగోలుగా దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. ప్రత్యక్ష డిజిటల్ లావాదేవీలు లేకుండా పెద్దఎత్తున మనీ లా వాదావీలు చేశారన్నారు. వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ అక్రమాలకు పాల్పడ్డ వారిని చట్టం తప్పకుండా శిక్షిస్తుందని హెచ్చరించారు. అంతేకాక లిక్కర్ స్కాంలో దాగి ఉన్న తిమింగలాలు కూడా త్వరలోనే బహిర్గతమవుతాయని మాధవ్ స్పష్టం చేశారు.