– సి. ఆర్. మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్
విజయవాడ : ఆగస్టు నెల 2,3 తేదీలలో గుంటూరు జిల్లా గ్రామీణ విలేఖరులకు పునశ్చరణ తరగతులను సి. ఆర్. మీడియా అకాడమి నిర్వహిస్తున్నదనీ ఈ కార్యక్రమాన్ని గ్రామీణ విలేఖరులు సద్వినియోగం చేసుకోవాలని సి. ఆర్. మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
పునశ్చరణ తరగతులు తెనాలి, తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆగష్టు 2,3 తేదీలలో జరుగుతాయి. ఈ కార్యక్రమం శనివారం (2.8.25) ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. సభా కార్యక్రమం అనంతరం తరగతులు ప్రారంభం అవుతాయి.
2 రోజుల కార్యక్రమంలో తొలి రోజున “సోషల్ మీడియా యుగంలో మీడియా పాత్ర; జర్నలిజంలో నైతిక నిష్ఠ; మీడియాలో నూతన ధోరణులు” అనే అంశాలపైన తదుపరి 2వ రోజున “విలేఖరుల నుంచి డెస్క్ ఏం కోరుకుంటుంది; గ్రామీణ వార్తలు, కథనాలు; పత్రికా భాషలో మెళకువలు; స్మార్ట్ రిపోర్టింగ్” అనే అంశాలపై సీనియర్ జర్నలిస్టులు శిక్షణ ఇస్తారని చైర్మన్ తెలియజేశారు.