.- 76 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా కులగణన చేస్తామన్నారా?
– బీసీల రిజర్వేషన్ల విషయంలో రేవంత్ డ్రామా
– గోబెల్స్ ప్రచారంతో బిజెపి ని దెబ్బతీసే కుట్ర
– ఓబీసీ మోర్చా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఎంపీ ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి బీసీల రిజర్వేషన్ల విషయంలో డ్రామా చేస్తున్నారు. పైగా కేంద్రం మీద, బిజెపి మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి బిజెపి కార్యకర్త మీద ఉంది.
రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు బీసీలకు అనేక వాగ్దానాలు చేశారు. అధికారంలోకి రావడానికి కల్లబొల్లి మాటలు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయడం లేదు. వచ్చే ఎన్నికల్లో బిజెపి గ్యారెంటీగా అధికారంలోకి వస్తుంది. అందుకే, దాన్ని అడ్డుకోవడానికి ఏదో ఒక వర్గానికి వ్యతిరేకమన్న ముద్ర వేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
బిజెపి కి బలమైన పునాది ఉంది. అది కార్యకర్తల పునాది, సిద్ధాంతాల పునాది. బిజెపి ఒకసారి పడగ విప్పితే దీన్ని ఎవ్వరూ ఆపలేరు అనే దృష్టితో, భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోబెల్స్ ప్రచారంతో బిజెపి ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. ఇప్పటివరకు చట్టం చేయలేకపోయింది.
స్థానిక సంస్థలన్నీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి బీసీలకు న్యాయం చేయడానికి మొత్తం పూర్తి అధికారాలు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉన్నాయి.రాజ్యాంగంలోని 243-D(6) ప్రకారం బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే పూర్తి అధికారమూ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది.
నిజానికి బీసీలకు మేలు చేయకూడదన్న అజెండాతోనే కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం కొనసాగిస్తున్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల విసయంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు గానీ, ఆమోద ప్రక్రియలో గానీ బీసీలకు రిజర్వేషన్ పెంచాలనే తపన ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపించలేదు. ఆ తర్వాత గవర్నర్ వద్దకు పంపించారు, ఢిల్లీకి పంపించారు. కానీ ఎక్కడా బిజెపి అడ్డంకి కలిగించలేదు.
అసెంబ్లీలో బిజెపి సభ్యులంతా ఆ బిల్లుకు మద్దతు తెలిపారు. అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అడుగడుగున తప్పుడు ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చింది. బీసీలకు మంత్రివర్గంలో 42% వాటా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఎందుకు కేబినెట్ లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదు?
కార్పొరేషన్ చైర్మన్ పదవులలో 60 ఉండగా, కనీసం 20 శాతం కూడా బీసీలకు ఇవ్వలేదు. ఐదుగురు ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించినా, బీసీలకు అవకాశం ఇవ్వలేదు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీమ్ కోసం మేం ఐదు రోజుల నిరాహార దీక్ష చేసిన సమయంలో కిషన్ రెడ్డి కూడా దీక్ష కొనసాగించారు. అప్పుడు ఒక్క బీసీ నాయకుడు కూడా మద్దతుగా నిలవలేదు.
ప్రస్తుత బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కూడా బీసీ విద్యార్థులకు విద్యాసంస్థలు, హాస్టల్స్ లో మౌలిక సదుపాయాల, బీసీల హక్కుల కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యా రంగ ఉద్యమాల్లో ముందుండి పోరాడారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలపై ప్రేమ చూపుతున్నట్లు నటించడం తప్ప, అది నిజమైన ప్రేమ కాదు. కాంగ్రెస్ పార్టీ 57 ఏళ్ల పాలనలో ఉన్నప్పుడు ఒక్కసారి అయినా బీసీ వ్యక్తిని ప్రధానమంత్రిని చేయలేదు. బ్రిటిష్ ప్రభుత్వం 95 ఏళ్ల కిందట కులగణన చేసింది. 76 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా కులగణన చేస్తామన్నారా? బీసీలు అనేక ఉద్యమాలు చేశారు. కోర్టుల్లో కేసులు వేయడం జరిగింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, కులగణన జరపాలని రిక్వెస్ట్ చేయగానే, చారిత్రకమైన నిర్ణయం తీసుకున్నారు. జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బీసీలకు సరైన ప్రాధాన్యత కల్పించలేదు, బడ్జెట్ కేటాయించలేదు.