ఓరి నాయనో.. ఇది చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కావట్లేదు. ఐదేళ్లుగా జగన్ గారి ‘మద్యం నిషేదం’ వల్ల మన మందుబాబులు పడ్డ కష్టాలన్నీ పక్కన పెడితే, ఇప్పుడు పక్క రాష్ట్రాలు ‘అయ్యో.. మా ఆదాయం పోయిందే’ అని ఏడుస్తున్నాయి.
తెలంగాణ, కర్ణాటక వాళ్ళు ‘మా మద్యం అమ్మకాలు పడిపోయాయి’ అని వాపోతున్నారు. ఇంతకాలం మన పక్క రాష్ట్రాలు మన మద్యం అమ్మకాలతో పండగ చేసుకున్నాయి, ఇప్పుడు వారికి నష్టం వస్తే మనమేం చేయగలం?
ఒకప్పుడు మన జగన్ “మద్య నిషేధం” అనే మాయాజాలం మొదలుపెట్టి, మందుబాబుల జేబులను దోచుకోవడానికి కొత్త ప్లాన్ వేశారు. ఆయన ప్రత్యేకంగా తయారు చేసిన బ్రాండ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘బూం బూం’, ‘పాల్కోన్’, ‘ప్రెసిడెంట్ మెడళ్వంటి వింత పేర్లు గల మందు సీసాలు చూసి మందుబాబులు ‘ఇవేం బ్రాండ్స్ సామీ.. మాకిదొద్దు!’ అని కంగారుపడ్డారు.
తాగిన తర్వాత మరుసటి రోజు పీల్చుకున్న గాలి కూడా ఆ నాసిరకం మందుల నుంచి వచ్చే వాసనలాగే ఉండేది. ఈ ‘ప్రత్యేకమైన’ బ్రాండ్లను భరించలేక ఆంధ్రప్రదేశ్లోని మందుబాబులు “జై తెలంగాణా.. జై కర్ణాటకా” అని చెప్పి, సరిహద్దులు దాటారు.తెలంగాణలోని ఖమ్మం, కర్ణాటకలోని కోలార్ జిల్లాల్లో మద్యం అమ్మకాలు ఆకాశాన్ని అంటాయి.
తెలంగాణ టుడే పత్రిక రాసినట్లుగా, మన జనాలు తెలంగాణకు వచ్చి ‘మంచి మందు’ తాగి, అక్కడే పండగ చేసుకున్నారు. అప్పుడు తెలంగాణలోని మద్యం దుకాణాల యజమానులు జగన్ గారికి ‘థాంక్స్’ చెప్పేవారు.
కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక, మన మందుబాబుల కష్టాలు తీరిపోయాయి. నాణ్యమైన బ్రాండ్స్, తక్కువ ధరలకే లభిస్తుండడంతో ప్రజలు ఆనందంలో మునిగితేలారు. దీంతో మన పక్క రాష్ట్రాలకు ఇప్పుడు భయం పట్టుకుంది.
తెలంగాణ, కర్ణాటకలు: ‘మా ఖజానా ఖాళీ అవుతుంది!’
‘డెక్కన్ హెరాల్డ్’ పత్రిక ప్రకారం, కర్ణాటకలోని కోలార్ జిల్లా ఎక్సైజ్ కమిషనర్ వెంకటేష్ గారు మీడియా ముందు మాట్లాడుతూ, “మా మద్యం అమ్మకాలు పడిపోయాయి, దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ లోని కొత్త మద్యం విధానం. అక్కడ ధరలు తక్కువగా ఉన్నాయి” అని వాపోయారు.
అలాగే ‘పయనీర్’ పత్రిక కూడా తెలంగాణలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయని, ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో రూ. 10 కోట్లు నష్టపోయారని రాసింది. ఖమ్మం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నాగేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, “మాన్షన్ హౌస్, ఓఏబీ వంటి బ్రాండ్లు ఇప్పుడు ఏపీలో కూడా అందుబాటులోకి వచ్చాయి, అందుకే ప్రజలు ఇక్కడికి రావడం తగ్గించారు” అని చెప్పారు.
మొత్తానికి, జగన్ ఐదేళ్ల పాటు సొంత రాష్ట్ర ప్రజల జేబులు లూటీ చేసి, తన జేబులు నింపుకొంటూ, మన రాష్ట్ర ఖజానాకు బొక్క పెట్టి, పక్క రాష్ట్రాల ఖజానాలను నింపారు. ఇప్పుడు చంద్రబాబు ఆ నష్టాన్ని పూడ్చే పనిలో ఉన్నారు. గతంలో మందుబాబుల మధ్య జరిగిన ‘మా బ్రాండ్స్ గొప్ప, మీ గబ్బు బ్రాండ్స్’ అనే చర్చలు జరిగేవి.
చివరికి మన వాళ్లు “అవును జగన్ కాబోయే అల్లుళ్ల కోసం ముక్కుమూసుకొని మేము జేబులు గుల్ల చేసుకొంటున్నాం” అని బోరుమనేవారు. ఇప్పుడు పక్క రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘మా ఆదాయం పోయింది, మీ ఆదాయం పెరిగింది’ అనే రచ్చగా మారింది. అవును, ఇంతకాలం పక్క రాష్ట్రాల్లో జరిగిన జగన్ పండగ పోయి, ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన షాక్తో వాళ్లు బేర్ మంటున్నారు!