– మంత్రి వాసంశెట్టి సుభాష్
విజయవాడ: లేబర్ కమిషనర్ ఆఫీస్ లో పారిశ్రామిక భద్రతను ప్రోత్సహించడానికి, నియంత్రణ, మద్దతు ఇవ్వడానికి, సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ఆధారిత విధాన రూపకల్పన కోసం పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, జేఎన్టీయూ అనంతపూర్, డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సెక్రటరీ శేషగిరి బాబు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా ప్రమాదకర, రసాయన పరిశ్రమలలో భద్రతా ఆడిట్లను నిర్వహిస్తారని, అలాగే హెచ్ఐఆర్ఏ(హాజర్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్), హెచ్ఏజెడ్ఓపీ(హాజర్డ్ అండ్ ఆపరేబిలిటీ స్టడీ), హెచ్ఏఆర్ఏ(హాజర్డ్ అనాలిసిస్ అండ్ రిస్క్ అసెస్మెంట్) వంటి సాంకేతిక అధ్యయనాలను చెబుతున్నట్టు, పారిశ్రామిక ప్రమాదాలను పరిశోధించి, మూల కారణాలను విశ్లేషించి నివారణ, దిద్దుబాటు చర్యలను సిఫార్సు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ డిప్యూటీ కమిషనర్ గంధం చంద్రుడు, వెంకటేశ్వరయూనివర్సిటీ ప్రతినిధులు, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహన్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.