తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నూతన కార్యాలయం తాడేపల్లిలో ప్రారంభమైంది. ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులకు సంబంధించిన న్యాయసహాయాన్ని అందించేందుకు వీలుగా ఈ కార్యాలయంను ఏర్పాటుచేశారు.
వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులు, అరెస్ట్‌లతో కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న నేపధ్యంలో వారికి అండగా వైఎస్సార్సీపీ న్యాయవిభాగం సేవలు అందిస్తోంది. పార్టీ నుంచి న్యాయసహాయం కావాల్సిన వారు ఎవరైనా సరే తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ ఎం.మనోహర్ రెడ్డి, నాగిరెడ్డి, సుదర్శన్ రెడ్డి, జానకిరామిరెడ్డి, గవాస్కర్, కొమ్మసాని శ్రీనివాసరెడ్డి, సందు సతీష్, రాసినేని హరీష్, మూర్తి పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.