– సర్పంచ్ల తీర్మానం మేరకే ఉపాధి హామీ పనులు పనులు చేపట్టాలి
– స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి ప్రోటోకాల్ ని పాటించాలి
– పెండింగులో ఉన్న గౌరవ వేతనాల్ని తక్షణమే విడుదల చేయాలి
: వైయస్సార్సీపి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి డిమాండ్
తాడేపల్లి: ఎన్నికలకు ముందు కూటమి నేతలు గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తామంటూ, సర్పంచ్లకు చట్టపరంగా అన్ని అధికారాలు దక్కేలా కృషి చేస్తామంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయం ఎదుట సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్దంగా కల్పించిన అధికారాలు, హక్కులను కూడా కాలరాస్తోందని మండిపడ్డారు. సాధారణ ఎన్నికలకి ముందు సర్పంచ్లకు అనేక వాగ్దానాలని ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోగా కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని అన్నారు. 15వ ఫైనాన్స్ కమీషన్ నిధులని డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాటిని స్థానికి సంస్థల ఖాతాలో జమచేయక పోగా మొత్తం దారి మల్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ రోజు గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి, తాగునీటి బోర్ల మరమ్మతులకి, శానిటేషన్ కి కూడా నిధులు సమకూర్చకపోతే గ్రామాలు ఎలా మనుగడ సాగిస్తాయని ప్రశ్నించారు.
కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్, శ్రీ రామ మూర్తి, వైస్సార్సీపీ ఎంపీపీ ల సంఘము రాష్ట్ర అధ్యక్షులు ముళ్ళపూడి గాంధీ, వైస్సార్సీపీ పంచాయత్ రాజ్ విభాగం కృష్ణ, గుంటూరు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, దాసరి రాజు, రాష్ట్ర కార్యదర్శి చక్రారెడ్డి, సర్పంచ్ల సంఘం నాయకులు మహేష్ రెడ్డి, జయరామి రెడ్డి, నాగరాజు, రసూల్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.