(చాకిరేవు)
బ్రిటీష్ ఎంపైర్ అమ్మ మొగొడికి మించిన నా పాలనలో మీరు బానిసలు అని గుర్తుచేసే బ్రాండ్స్ గురించి తెలుసుకొందాం.
విక్టోరియా వుండగా మన దేశంలో బ్రిటీష్ పాలన మొదలైంది. తరువాత కింగులు. వారి పేర్లతో.. ఈ దేశంలో బానిసత్వం మొదలైంది అని గుర్తుచేస్తూ.. మొదలెట్టాడు.
పుంగునూరులో ఒక యువకుడు ఇదేం మద్యం అని సోషల్మీడియాలో తిడితే.. తెల్లారేసరికి ఆత్మహత్య చేసుకొన్నాడు అని ప్రకటించి, ప్రశ్నిస్తే మీకు ప్రాణహాని అని భయకంపితులను చేస్తూ.. విషమద్యాన్ని వికటాట్టహాసం చేస్తూ జనం గొంతుల్లో పోశాడు.
మరికొన్ని దగ్గరగా పోలిన పేర్లతో. ఆఖరికి తన పార్టీ బ్లూ & వైట్ పేరుతో కూడా మీరు ఇప్పుడు మా బానిసలు అని తెలిసేలా.. ఇది మా కొత్త యూనిఫాం రంగు గుర్తుపెట్టుకోండి అని జనానికి గుర్తుచేస్తూ తను కట్టినా.. కట్టకున్నా శ్మశానలలో సమాధులకు సైతం, ఆ నీలి విష రంగులేసి చూపిస్తూ అడగడుగునా గుర్తుచేశాడు.
జన జీవితాలు నురగలు కక్కేలా.. నీలి విషాన్ని పోసి.. బందిపోటుకు మించి దోచుకొన్న గజ దొంగలకే అమ్మ మొగుడిని నేను, మీకు దిక్కు లేదు, నాకు ఎదురేలేదు, వైనాట్ వన్ సెవెంటీఫైవ్ అని రంకెలేస్తూ.. ఘీంకరించిన అహంకారాన్ని, ప్రజాస్వామ్య అంకుశం పదకొండు పోట్లు పొడిచింది.
గులకరాయి కూడా సాక్ష్యంగా దొరకదు అనుకొన్నాడు. పదకొండు కోట్ల కరెన్సీ నుండి పాపపు సొమ్ములను గుట్టలుగా పేర్చి, పాతిక కోట్లను లెక్కేస్తున్న డెన్లు చూసి, అంత నిజమైన డబ్బులు చూసి మా జన్మ ధన్యం అయ్యింది అని కోట్లాదిమంది జనం నోరెళ్లబెట్టి చూశారు.
విక్టోరియా, కింగ్, ఎంపైర్, వైట్ అండ్ బ్లూ… మద్యం బ్రాండ్లు కాదు, బానిసత్వపు ముద్రలు!
ఆ రెండో నిరంకుశ పాలన పోయింది – ఆ బ్రాండ్లు పోయాయి. కఠినంగా శిక్షించకపోతే ఇలాంటి బానిసత్వాలు ఐదేళ్లు చాలు, తెలుగు జాతిని నిర్వీర్యం చేయడానికి.