సంస్కృతికి వారధులై.. తమ నైపుణ్యాన్ని మరో తరానికి అందిస్తూ.. తర తరాలుగా తమ జీవితాలను నేస్తున్న వారి ఆశలకు, కలలకు, కన్నీళ్లకు, ప్రతిభకు మగ్గం సాక్ష్యం. అది మురిసింది.
చేనేత కార్మికుల ముఖాల్లో చిరునవ్వులు విరబూసేలా, వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా.. నేతన్నల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ, వారి శ్రమకు తగిన గౌరవం ఇస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతన్నల గుండెల్లో నిలిచిపోయారు.
ఇకపై.. మగ్గాలకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. అంతేకాదు, చేనేత వస్త్రాలపై ఉన్న జీఎస్టీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించనుంది. ఈ చారిత్రక నిర్ణయాల వల్ల చేనేత ఉత్పత్తులు తక్కువ ధరలకే లభించి, అమ్మకాలు పెరుగుతాయి. నేతన్నలకు మరింత ఆదాయం లభించి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. రూ. 5 కోట్లతో ప్రత్యేక నిధి (త్రిఫ్ట్ ఫండ్) నేతన్నల జీవితాల్లో భద్రతకు భరోసాను కలిగిస్తుంది.
ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, తరతరాల చేనేత కళకు లభించిన గుర్తింపు, గౌరవం. ఈ అద్భుతమైన నిర్ణయాలతో నేతన్నల జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటికే మన చేనేత ఉత్పత్తులు 10 జాతీయ అవార్డులు గెలుచుకుని మన రాష్ట్రానికి పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వ ప్రోత్సాహంతో, మన చేనేత కళ మరింతగా వెలిగిపోనుంది.
ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం నుంచే ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయి. నేతన్నల ముఖాల్లో ఆనందం నిండిన ఈ శుభసందర్భం, వారి కష్టాలకు లభించిన గొప్ప బహుమతిగా భావించవచ్చు. వ్యవసాయం తర్వాత అత్యంత కీలకమైన రంగంగా ఉన్న చేనేతకు ఇప్పుడు నిజమైన చంద్రుని అండ లభించింది.
మగ్గం మన సంస్కృతి – చేనేతల జీవితాలకు వెలుగు మన చంద్రుడు!.