కాకినాడ: ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కొప్పవరంలోని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 17వ ప్రజా దర్బార్ నిర్వహించారు. పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు, ఉపాధి, వైద్యం, తదితరాలకు సంబంధించి 17 అర్జీలు వచ్చాయని వాటిలో 12 అర్జీలు అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించినట్టు ఇన్ఛార్జి మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. అలాగే ఎంపీ సానా సతీష్ బాబు సూచన మేరకు కార్యకర్తలకు కూడా ఒక రోజుని కేటాయిస్తూ వారి సమస్యలు కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్ , జున్నూరు బాబ్జి, ఏటుకూరి నాగమణి, నరహరిశెట్టి సూరిబాబు, బండి నరేంద్ర, వెన్నపు చక్రధర్, చీకట్ల వెంకటేష్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.