– మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
నిమ్మాడ: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతలు స్వీకరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతులు అందాయి. నూతన పింఛన్లు మంజూరు చేయాలని, నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్దఎత్తున వినతులు అందుతున్నాయి. త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు మేలు చేసేవిధంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధులలో అలసత్వం లేకుంగా అధికారులు పనిచేయాలని సూచించారు.