– ఉపఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాజు
– పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి తరపున జోరుగా ఎన్నికల ప్రచారం
పులివెందుల: పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల సందర్భంగా కూటమి తరపున పోటీ చేస్తున్న మారెడ్డి లతారెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని పులివెందుల ఓటర్లను మడకశిర శాసన సభ్యుడు, టీటీడీ పాలకమండలి సభ్యుడు ఎం.ఎస్.రాజు విజ్ఞప్తి చేశారు. పులివెందుల మండలంలోని ఆర్.తుంపలపల్లి ఎస్సీ కాలనీలో పార్టీ నేతలతో కలిసి ఎం.ఎస్.రాజు లతారెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఆర్.తుంపలపల్లి ఎస్సీ కాలనీలోని ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అక్కడి ప్రజలను ఆప్యాయంగా పలకరించి, ఎన్నికల కరపత్రాలను పంపిణీ చేశారు. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డిని గెలిపిస్తే, తమ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.రాజుతో పాటు ఉమ్మడి అనంతపురంజిల్లా ఏడీసీసీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.