* నగరంలోని జండా వీధి వద్ద వైద్య శిబిరం
* పట్టణానికే కాకుండా పల్లెలకు మెరుగైన వైద్య సేవలు
* రూ. 2 కోట్లతో విలువ గలిగిన వాహనాలను ప్రారంభం
* ప్రతిరోజు ఒక డివిజన్ కు వెళ్ళనున్న ఆన్ వీల్స్ వాహనం
* ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి
– – ఇంటి వద్దకే వైద్యం వాహనాలు ప్రారంభించిన మంత్రి నారాయణ
గుంటూరు: నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ – ఇంటివద్దకే వైద్యం వాహనాలను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. నగరంలోని జెండావీధి షాదీ మంజిల్ వద్ద మొబైల్ వైద్యశిబిరం నారాయణ హాస్పిటల్స్ వారు ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా మంత్రి నారాయణ పాల్గొన్నారు. డివిజన్ కు విచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
పట్టణాలకే కాకుండా పల్లెలకి కూడా మెరుగైన వైద్యసేవలు అందించాలని నారాయణ హాస్పిటల్ సంకల్పించిందని, అందుకోసం రెండు కోట్లతో నారాయణ హెల్ప్ ఆన్ వీల్స్ వాహనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ వాహనంలో వైద్య సేవలు, పరీక్షలకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. ఈ వాహనం ప్రతీ రోజూ ఒక డివిజన్ కి వెళ్ళి నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అద్భుతమైన ఆలోచన చేసిన హాస్పిటల్ సిబ్బందికి మంత్రి నారాయణ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమీషనర్ నందన్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ, నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిలు, టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.