– టిడిపి పశ్చిమ లో చిచ్చురేపిన ఎన్టీఆర్ స్టేడియం ఎన్నిక
– ఆలపాటి వర్సెస్ గల్లా మాధవి
– ఎమ్మెల్యేకు తెలియకుండానే ఎన్నిక నోటిఫికేషన్
– అభ్యర్ధుల్లో ఒకరు ఆలపాటి వర్గీయుడు
– తనకు తెలియకుండా ఎన్నిక జరగడంపై గల్లా ఆగ్రహం
– లోకేష్ ఫిర్యాదుతో ఆగిన ఎన్నికలు
– ఎమ్మెల్యే తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి
( వాసిరెడ్డి రవిచంద్ర)
తెలుగుదేశం సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర తో వివాదం మరవక ముందే.. ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో, గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గంగా మాధవి వివాదం పార్టీలో పెద్ద దుమారానికి దారితీసింది.
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణ సొసైటీ ఎన్నిక తెలుగుదేశంలో వర్గ పోరుకు బీజం వేసింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ తనకు తెలియకుండా వచ్చిందన్న ఆగ్రహంతో గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి, అధిష్టానం వద్ద పట్టు పట్టి ఎన్నికను నిలిపివేయించాలని ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం కూడా ముగిసే సమయానికి టిడిపి కి చెందిన ఇద్దరు నేతలు, స్టేడియం పాలకవర్గ కార్యదర్శి పోస్టుకు బరిలో నిలిచారు.మొత్తం ఎనిమిది పోస్టులకు 59 మంది నామినేషన్లు పడ్డాయి బుజ్జగింపులు తర్వాత సెక్రెటరీ పోస్ట్లు ఇద్దరు పోటీలో ఉండగా ఈసీ నెంబర్లు గా 11 మంది ఎన్నికల బరిలో నిలిచారు అయితే ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అనుచరుడుగా ఉన్న వజ్జా రామకృష్ణ ఒకరు కాగా, మరొకరు పార్టీ సీనియర్ నాయకులు దొడ్డ రాజేంద్ర పోటీపడ్డారు.
మీరు కాకుండా మిగిలిన పోస్టులకూ పలువురు పోటీలో నిలిచారు అయితే స్టేడియం పాలకవర్గ ఎన్నికల్లో సభ్యులుగా మొత్తం 2200 ఓట్లు ఉన్నాయి. ఇందులో 2000 ఓట్లు తెలుగుదేశం సానుభూతిపరులే ఉంటారు. మరి ఎన్నికలు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు? ఎందుకు నిలిపివేసినట్లు అన్న ప్రశ్న అందరికీ ఉత్పన్నమవుతుంది తెలుగుదేశానికి బలం ఉన్న స్టేడియం ఎన్నికలు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిర్వహించలేకపోతున్నారని వాదన కూడా లేకపోలేదు. మేయర్ గా ఇటీవల పార్టీ సీనియర్ నాయకులు కోవెలమూడి రవీంద్ర ఉన్నారు. కోవెలమూడి రవీంద్ర నోటిఫికేషన్ వరకు మాత్రమే ఇందులో జోక్యం చేసుకున్నారని తెలుస్తుంది.
అయితే ఎమ్మెల్యేకి తెలియకుండా నోటిఫికేషన్ వచ్చింది. దానిని ఆమె జీర్ణించుకోలేకపోయారు. పోటీలో ఉంది ఆలపాటి రాజా అనుచరుడు కావడం, మరో పార్టీ నాయకుడు దొడ్డ రాజేంద్ర పోటీ పడడం వీరి మధ్య సర్దుబాటు చేయకముందే.. యువనేత లోకేష్ వద్దకు స్టేడియం ఎన్నికల వ్యవహారం చేరుకొని, ఎమ్మెల్యే మాధవి కోరిన మీదట ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఏది ఏమైనా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ స్టేడియం ఎన్నికలు టీడీపీలో వర్గ పోరు బట్టబయలైంది. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవికి, ఆలపాటి రాజా, మేయర్ రవీంద్ర సఖ్యత కొరవడిందని స్టేడియం ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. తెలుగుదేశానికి బలమైన గుంటూరు టు నియోజకవర్గంలో నాయకులు మధ్య సఖ్యత కొరవడం పార్టీ క్యాడర్ను కలచివేస్తుంది. .
అధికారం వచ్చిన సమయంలో పార్టీకి పనిచేసిన వారికి ఇలాంటి పదవులు ఇచ్చి గుర్తింపు ఇవ్వాల్సి ఉండగా, నేతల మధ్య వివాదం పార్టీకి తలవొంపులు తెచ్చిపెడుతుందని పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో టిడిపి సీనియర్ నాయకులు దామరచర్ల శ్రీనివాసరావు, చుక్కపల్లి రమేష్ స్టేడియం పాలకవర్గ కార్యదర్శిగా పనిచేసే స్టేడియం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు అలాంటి పెద్దల అనుభవాలను సలహాలను తీసుకొని.. టిడిపి కంచుకోటలో టిడిపి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు తెలుగుదేశం శ్రేయోభిలాషులు చెబుతున్నారు