– వాటి పేర్లతో ఓటరు జాబితాలో చేరుస్తారా?
– ఒక చిన్న పల్లెటూరు లో 700 ఓట్లు ఎట్లా పెరిగాయి?
-రోహింగ్యాలకు ఓటు హక్కు ఎలా ఇస్తారు?
– దొంగ ఓట్లు తీసేయకూడదా?
– అందుకే కేంద్రం ఎస్ఐఆర్ బీహార్ లో మొదలెట్టింది
– ఐలపూర్ లో దొంగ ఓట్ల పై ఫిర్యాదు
– రాహుల్.. దొంగ ఓట్లకు మీ మద్దతు ఉన్నదా?
– బీఆర్కె భవన్ లో వినతి పత్రం ఇచ్చిన తర్వాత మీడియాతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్: ఐలపూర్ లో దొంగ ఓట్ల పై ఫిర్యాదు చేశాం. మెదక్ నియోజకవర్గంలో ఐలపూర్ అనే ఒక చిన్న గ్రామంలో 700 పైగా ఓట్లు ఎట్లా పెరిగాయి?మొదటి సారి పొరపాటు జరిగిందని 10 జనవరి , 2024 లో స్ధానిక సర్పంచ్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కి ఫిర్యాదు చేసాం. పార్లమెంట్ ఎన్నికలకు ఇచ్చిన ఫైనల్ ఓటర్ లిస్టు కంటే నెల ముందు ఇచ్చినం.
19 జనవరి 2024న జిల్లా కలెక్టర్ కీ అదే సర్పంచ్ చేత ఫిర్యాదు ఇప్పించాం. 28 ఫిబ్రవరి 2024 న ఫైనల్ ఓటర్ లిస్టు వచ్చాక తహశీల్దార్ కి ఫిర్యాదు చేసినం. అప్పటి సీఈఓ వికాస్ రాజ్ కి 15 ఏప్రిల్ 2024 న ఫిర్యాదు చేసినం.
ఒక చిన్న పల్లెటూరు లో 950 ఉండాల్సిన ఓట్లు దాదాపుగా 700 ఓట్లు ఎట్లా పెరిగాయి? ఐలపూర్ లో ఉన్న ఇండ్ల వివరాలను 1-1 నుంచి 3-8 వరకు ఇండ్లు ఉంటే స్మశానవాటికకు, బోరింగ్ కు, ట్యాంక్ కు కూడా ఇంటి నెంబర్లు ఇచ్చి ఇష్టమున్నట్టు ఓటర్లను కలిపారు. 950 ఓట్లు ఉండాల్సిన ఐలపూర్ లో, ఇప్పుడు చూస్తే ఏకంగా 2500 ఓట్లు కనపడుతున్నాయి.
126 మరియు 126/a ఉండే పోలింగ్ స్టేషన్లు ఉంటే ఇప్పుడు 138, 137, 136, 135 అని నాలుగు పోలింగ్ స్టేషన్స్ పెంచారు.
రాహుల్ గాంధీ గారు.. మీరు పాలించే తెలంగాణ రాష్ట్రం లొ ఒక పల్లెటూరు లొనే 950 ఓట్లు కాస్త 2500 పెరిగాయి. అందుకే కేంద్రం ఎస్ఐఆర్ బీహార్ లో మొదలెట్టింది. బెంగళూరు లో రెండు దొంగ ఓట్లను చూపి ఏదో చెప్తున్నాడు. వేల ఓట్లు ఇక్కడ పెరిగాయి వాటిని తొలగించవద్దా?
ఇతర రాష్ట్రాలు రోహింగ్యాల వచ్చి దొంగ ఓట్లు నమోదు చేస్తే తొలగింవవవద్దా? దొంగ ఓట్ల తో గెలవాల్సిన అవసరం మా పార్టీకీ లేదు. దొంగ ఓట్లకు మీ మద్దతు ఉన్నదా? దొంగ ఓట్లు తీసేస్తే మీకు భయం దేనికి?