– చీరలు, దుప్పట్ల పంపిణీ
సత్తెనపల్లి: సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు కన్నా లక్ష్మీ నారాయణ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాకతీయ కల్యాణ మండపంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కాటూరి హాస్పిటల్, కోట సైదయ్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు.
నియోజకవర్గ నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా అభిమానులు ఉదయం నుంచి సాయంత్రం వరకు టపాసులు పేల్చారు. పలు ప్రాంతాల్లో పేద మహిళలకు చీరలు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంచారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు