(చాకిరేవు)
ఆయన గంటా అరగంటవి వచ్చాయి అనుకొని నిరుత్సాహపడకండి. ఆయన తన ఎక్స్ అకౌంట్ నుండి “ఈ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోయ ప్రవీణ్ ఐపిఎస్‌కి అంకింతం !” అంటూ పెట్టిన పోస్ట్‌తో అడ్డంగా దొరికాడు.
ఎన్నికల సమయంలో అబద్ధపు ప్రచారాలు, తప్పుడు సమాచారం తారాస్థాయికి తీసుకు పోవడం వైకాపాకు సర్వ సాధారణమైపోయింది. ఇవ్వాళ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల్లో డిపాజిట్ కోల్పోయి దిక్కు తోచక, కళ్లు మూసుకొని ఈ వీడియో పెట్టాడు.
జాగ్రత్తగా బ్యాలెట్ పేపర్ల రంగు చూడండి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నియమావళి ప్రకారం, స్థానిక ఎన్నికలలో బ్యాలెట్ పేపర్ల రంగులు స్పష్టంగా నిర్ణయించబడ్డాయి. ఎంపీటీసీ ఎన్నికలకు తెల్లని బ్యాలెట్ వాడతారు. జెడ్పీటీసీ ఎన్నికలకు గులాబీ (పింక్) బ్యాలెట్ వాడతారు. ఈ రంగుల విధానం ఒక ప్రామాణిక (స్టాండర్డ్) విధానం. ఓటర్లకు, ఎన్నికల అధికారులకు గందరగోళం లేకుండా ఓటింగ్‌ను నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది.
పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాలలో స్థానిక ఎన్నికలకు వేర్వేరు రంగులు వాడతారు. ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్‌లోని జిల్లా పరిషత్ ఎన్నికలకు పసుపు (ఎల్లో) బ్యాలెట్ వాడతారు.
అంబటి రాంబాబు పశ్చిమ బెంగాల్ ఎన్నికల బ్యాలెట్‌ను చూపించి, దానిని ఆంధ్రప్రదేశ్‌కు అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలలో కసిని రేపిన “ధూం ధూం” పాటను బ్యాక్ గ్రౌండ్లో పెట్టి ఇక్కడి వీడియో అని నమ్మించడానికి తమ అతితెలివితేటలను వైకాపా ఒలకబోసింది. ఇటీవలే ఇలా నెల్లూరులో బంగారుపాళ్యం మిక్స్ చేసి నవ్వుల పాలైన విషయం మనకు తెలిసిందే.
ఈ రంగుల విషయం ఓటర్లకు, సర్పంచ్ నుండి ఎంపీ వరకు ఏ రాజకీయ నాయకుడికైనా తెలిసిన విషయమే. ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉండి కూడా ఇలాంటి అసత్య ప్రచారాలను చేయడం, పైగా దానిని ఏకంగా ఐపీఎస్ అధికారికి ట్యాగ్ చెయ్యడం ఎంత బరితెగింపో, అసంబద్ధమో దీని ద్వారా అర్థమవుతుంది. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ.. ఫేక్ వీడియోతో అడ్డంగా దొరికిన అంబటి మీద పోలీసులు, ఎన్నికల కమీషన్ సుమోటోగా కేసు నమోదు చెయ్యాలి.
పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండి వైకాపాకు అక్కడి ప్రజాభిప్రాయం, ఎదురవ్వబోయే ఓటమి గురించి ముందే తెలుసు. అప్పటి నుండి ఒక పద్దతి ప్రకారం అబద్దాలను మొదలెట్టింది. జనం 11 ఇచ్చింది జీర్ణించుకోలేక ఇప్పటికీ ఈవీఎంల మీద అనుమానం అంటూ పబ్బం గడుపుతున్నారు. ఎన్నికల కమీషన్‌ను కలిసి పేపర్ బ్యాలెట్లో ఎన్నికలు కావాలి అని డిమాండ్ చేసింది.
తాజాగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మండలంలో డిపాజిట్ కోల్పోయే సరికి వైకాపా శ్రేణులకు ఏమని సమాధానం చెప్పాలో పాలుపోక, ఇలాంటి అబద్దపు ప్రచారాలతో ఇంకా నమ్మించి, పార్టీ మనుగడను వీరి అవినీతి పాపాలకు కవచంగా వాడుకోవాలని ప్రయత్నించి ఇలా అభాసు పాలవుతున్నారు.
ఫలితాలు లెక్కింపుకు ముందే హడావిడిగా హైకోర్టులో పిటిషన్ వేశారు. బ్లూ మీడియాలలో స్క్రోలింగులు వేశారు. ఫలితాలు వెల్లడైన వెంటనే.. రీపోలింగ్ పై వైసీపీ నేతల వేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. పులివెందుల, ఒంటిమిట్టలో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ నేతల పిటిషన్ వేశారు. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం ఎన్నికల కమిషన్ దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది హైకోర్టు.
అక్కడ కూడా వీరి ఓవర్ యాక్షన్‌కు మెట్టు దెబ్బలు పడడంతో.. ఇలా పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తోంది వైకాపా. ప్రజలు ఎలాగూ నమ్మరు, పాపం ఇంకా గుడ్డిగా నమ్ముతున్న వైకాపా శ్రేణుల్లోని అమాయకులకు ఈ అంబటి ఫేక్ వీడియోతో అయినా కనువిప్పు కావాలి.