చరిత్రలో సామ్రాజ్యాల పతనాలు ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా అంతరించాయి. సామ్రాజ్యాల పతనం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది—గర్జించే యుద్ధాలు, విప్లవాల మంటలు, రాజ్యాల రక్తపాతం, ప్రాంతీయ విధ్వేషాలు, ఫ్యాక్షనిజం. కానీ నిజం? చరిత్రలో చాలా సామ్రాజ్యాలు కూలినప్పుడు చప్పుడే లేదు. నెమ్మదిగా, నిశ్శబ్దంగా, ఒక పాత గడియారం ఆగినట్టు… అంతమయ్యాయి.
రోమన్ సామ్రాజ్యం: గ్లాడియేటర్ల గర్జనల మధ్య… ఓ మౌన మరణం
రోమన్ సామ్రాజ్యం—ఒకప్పుడు ప్రపంచాన్ని గద్దించిందని చెప్పుకునే సైనిక శక్తి. కానీ దాని చివరి రోజుల్లో? సైన్యం బలహీనపడింది, పాలక వారసులు పరస్పరంగా గొడవపడ్డారు, ప్రజలు పన్నుల భారంతో నలిగిపోయారు. చివరికి, సామ్రాజ్యం ఓ పాత కోటలా కూలిపోయింది—గోడలు కాదు, గౌరవం కూలింది.
సోవియట్ యూనియన్ (USSR) ఒకప్పుడు అమెరికాను గడగడలాడించిన శక్తి. కానీ చివరికి? దుకాణాల్లో బియ్యం లేదు, టెక్నాలజీలో వెనుకబాటుతనం, గోర్బచెవ్ సంస్కరణలు ప్రజల అసంతృప్తిని బయటపెట్టాయి. “గ్లాస్నోస్ట్” అనే పారదర్శకత, “పెరిస్ట్రోయికా” అనే పునర్నిర్మాణం… ఇవి USSRకి చివరి పేజీలు రాశాయి. దేశాలు ఒక్కొక్కటిగా విడిపోయాయి, USSR అనే పేరు చరిత్ర పుస్తకాల్లో మాత్రమే మిగిలింది.
పులివెందుల ఫ్యాక్షనిజం: గొడవల నుంచి బైరటీస్ మైన్ల దాకా పులివెందుల అంటే బాంబులు, గొడ్డళ్లు, ఫ్యాక్షన్ అనుకొనేలా సంధింటి కోట గోడలో నలిగిపోయింది. కక్షలలో కుటుంబాలు నాశనం అయ్యాయి.
రాష్ట్రంతో పాటు తమ ప్రాంతంలోకి రక్తం పారే చోట నీరు వచ్చింది చూశారు. చెట్లు నరికి సమాధులు కట్టే చోట పండ్ల వృక్షాలు పెరిగాయి, పండుతున్నాయి. పొరుగున అనంతపురం కూడా కియాతో, హార్టి కల్చర్‌తో అభివృద్ధి చెందుతోంది. తాము బయపడిన వారికి రాష్ట్రం బయపడకుండా పదకొండుతో పాతర వేసింది పరికించి చూసింది. యావత్తు రాష్ట్ర అభివృద్ధిని చూస్తోంది.
వస్తున్న పెట్టుబడులను, కంపెనీలు, ఉద్యోగాలను పరిశీలించింది. ఒకప్పుడు పండరి భజనల లాంటి సంస్కృతిని, పామరుడు సైతం చెప్పే వేమన పద్యాలను అందించింది గుర్తుచేసుకొంది. అన్నమయ్య నుండి కాలజ్ఞాని వీర బ్రహ్మం వరకు ఆధ్యాత్మికమైన ఆ నేల నిజంగా దేవుడి కడప.
పాలెగాళ్ళ నుండి వచ్చిన ఫ్యాక్షనిజం ఓ సంస్కృతి కాదు, ఓ చీకటి అధ్యాయం. ఇప్పుడు ఆ ప్రాంతం నిశ్శబ్దంగా మారుతోంది—గొడవల స్థానంలో గ్రీన్ఫీల్డ్లు, అభివృద్ధి ప్రాజెక్టులు. ఇప్పుడు ఒక రకంగా, “ఫ్యాక్షన్” అనే సామ్రాజ్యం మౌనంగా ముగిసిన కథ.
ఇది ఓ చరిత్ర కాదు, ఓ హెచ్చరిక. శబ్దం లేకుండా చరిత్ర మారుతుంది. సామ్రాజ్యాలు నశించడానికి బాంబులు అవసరం లేదు—మనిషి మనసులో చిన్న మార్పు చాలు.
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో వైసీపీకి ఘోర పరాభవం – వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6,035 ఓట్ల మెజార్టీతో లతారెడ్డి ఘన విజయం – పులివెందులలో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి// అనే వార్త రాజకీయ నాయకుల ముసుగులు వున్న నేరస్తుల ఆశలకు గొడ్డలిపోటు.
ఒకప్పుడు బాంబులు పేలిన చోట, బాబాయిలను గొడ్డలితో చంపిన చోట ఇక అభివృద్ధి అంకెలు వినిపిస్తుంది. ఇది చరిత్ర కాదు, ఇది ప్రజల తీర్పు.
తమ మీడియాలో.. కాదు గీదు అని గీపెట్టే గొడ్డలి వారసత్వ సోదరులు పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీ స్థానాలకు రాజీనామా చేసి, కేంద్ర బలగాలను కోరి, నిలబడి, కలబడి మళ్లీ ఒకసారి పరీక్షించుకొని మట్టికరిచి అర్థం చేసుకోవచ్చు, అక్కడి మనుషుల మనసులను.