– టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శ
మంగళగిరి: ‘కాగ్’ నివేదికలో అంకెలను కూడా వైసీపీ తారుమారు చేసి తిమ్మినిబమ్మి చేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శలు చేశారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్షి టీవీలో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ సంవత్సరం సంఖ్యలని రెండేళ్లక్రితం అంకెలతో పోల్చి రాష్ట్ర సొంత ఆదాయాన్ని కేంద్రం నుండి వచ్చిన రెవెన్యు డెఫిసిట్ ఆదాయాన్ని కలిపి తెలుగుదేశం ప్రభుత్వం విఫలం అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.
మాజీ ఆర్థిక మంత్రి మామిడి కాయలను ఆరెంజ్ పండ్లతో కంపేర్ చేయకూడదు. మాజీ ఆర్థిక మంత్రి ఏదేదో కలిపేసి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఆదాయం మాకు రూ.58 వేల కోట్లు వచ్చాయి. మీకు రూ.49 కోట్లే అంటే సామాన్యులకు కూడా అర్థం కావాలని కదా. ‘కాగ్’ నివేదికలో జూన్ నెలకు ఇచ్చిన అంకెలని అటూ ఇటూ మార్చి ప్రజల ముందు పెట్టారు. ‘కాగ్’ ఆడిటింగ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధీకృత సంస్థ. ప్రతి రాష్ట్రం, కేంద్రానికి సంబంధించి ప్రతి నెలా, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ స్పష్టమైన ఆర్థిక అంకెలను నివేదిక రూపంలో ఇస్తుంది.
ఆడిటింగ్ కు సంబంధించి అదే ఫైనల్. అయితే జగన్ రెడ్డి ఆ ‘కాగ్’ అంకెలకు కూడా, తనదైన భాష్యాన్ని చెప్తూ గత సంవత్సరం తక్కువ ఆదాయం అంటూ నమ్మించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జీఎస్టీ మొదలుకొని అన్నింటినీ, కూటమి ప్రభుత్వంలో తక్కువ అని చెప్పడానికి కుటిల రాజకీయాలు చేస్తున్నారు. ఆర్థిక సంఖ్యలు మామూలుగానే కొంచం క్లిష్టంగా ఉంటాయి. దానికి జగన్ లాంటి వారు వేరే భాష్యం చెబితే, ప్రజలు అదే నిజమని అనుకునే ప్రమాదం ఉంది.
కేంద్రం గ్రాంట్స్ ను కలిపేసుకుంటే ఆదాయం పెరిగినట్టా?
రాష్ట్ర సొంత ఆదాయం మూడు రకాలుగా ఉంది. రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం ఇఛ్చే గ్రాంట్స్, రాష్ట్ర పన్నుల్లో కేంద్రం వాటాగా ఇచ్చేది. బుగ్గన కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ ను కూడా కలిపేసి మాట్లాడేస్తున్నారు. రాష్ట్ర ఆదాయం నెలకోసారి లెక్కిస్తారు. 2023 జూలైలో మాకు రూ.58 వేల కోట్లు ఆదాయం వచ్చిందని బుగ్గన తప్పుడు లెక్కలు చెబుతున్నారు. రెండేళ్ల తర్వాత కూడా కూటమి ప్రభుత్వానికి 2025 జూలైలో రూ.49 వేల కోట్లే వచ్చిందని విమర్శలు చేస్తున్నారు. కేంద్రం ఒక్క పథకానికి ఇఛ్చే గ్రాంట్స్ ఒకే నెలలో రావాలని రూల్ లేదు.
ఏ నెలలో అయినా రావచ్చు. 2023 లో జూన్ జులైలో రూ.15 నుంచి రూ.20 వేల కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్స్ రూపంలో వచ్చాయి. 2014 రెవెన్యూ లోటు 2019 దాకా రాలేదు. అది కేంద్రం 2023లో విడుదల చేసింది ఆ గ్రాంట్స్ ను చూపించి మాకు ఎక్కువ ఆదాయం వచ్చిందని బుగ్గన మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు బుగ్గన ఆచితూచీ మాట్లాడుతారని అనుకున్నా. కానీ తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేసేలా మాట్లాడుతున్నారని అర్థమైంది. 2023 లో రూ.38,079 కోట్లు ఉంటే 2025లో ఈ ఏడాది రూ.45 వేల కోట్లు వచ్చింది. అంటే రూ.7 వేల కోట్లు ఆదాయం వచ్చింది. 2014 లో రావాల్సిన గ్రాంట్స్ ను 2023లో కలిపేసుకొని వచ్చిన ఆదాయం రూ.35 వేల కోట్లు. మొత్తం కలిపి రూ.58 వేల కోట్లు వచ్చినట్టు తప్పుడు మాటలు చెప్పుబుతున్నారు.
2023 జులైలో జీఎస్టీ రూ.14,905 కోట్లు, 2024 జులైలో రూ.15,258, 2025లో జులైలో రూ.16,574 కోట్లు వచ్చింది. రూ.2 వేల కోట్ల అదనంగా ఆదాయం వస్తే ఏదైదో చెప్పి కూటమి ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడవద్దని బుగ్గనకి హితవు పలుకుతున్నాను.
ఈనాడు ఎప్పుడు తప్పుడు కథనాలు ప్రచురించదు. సాక్షిలో ప్రచురిచేంది మాత్రమే తప్పుడు కథనాలు. స్ట్రాంప్స్ రిజిస్టేషన్ శాఖలో 2023 జులైలో రూ.3200 కోట్లు ఆదాయం వచ్చింది. 2024 లో రూ.2559 కోట్లు, 2025 రూ.3587 కోట్లు వచ్చింది. ఎకానమి దూసుకుపోతుందని దీని అర్థం. సేల్స్ ట్యాక్స్ 2023లో రూ.6300 కోట్లు వస్తే, 2025లో రూ.5875 కోట్లు ఆదాయం వచ్చింది. సేల్స్ ట్యాక్స్ మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. ఎక్సైజ్ శాఖలో 2023 లో రూ.4900 కోట్లు, 2024లో రూ.5000 కోట్లు, 2025లో రూ.5681 కోట్లు ఆదాయం వచ్చింది. రూ.800 కోట్లు అదనంగా ఆదాయం కూటమి ప్రభుత్వానికి వచ్చింది.
మద్యం ధరలు తగ్గించినా తాగేవాళ్లు ఎక్కువ ఏం కాలేదు. అదే సంఖ్యలో తాగుతున్నారు. అయినా మాకు రూ.800 కోట్లు ఆదాయం వచ్చింది. మీ హయాంలో లిక్కర్ సొమ్మంతా బయటి నుంచి బయటికే తరలించారు. దాదాపు రూ.5, 6 వేల కోట్లు దారిమళ్లించారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుజయ్ రెడ్డి, బాలాజీలు కలిసి బిగ్ బాస్ కు ఇస్తే ఎక్సైజ్ శాఖలో ఆదాయం ఎలా కనిపిస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండేచర్ తో హంద్రీనీవా పూర్తి చేశాం. కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. రూ.8500 కోట్లు పెట్టుబడుల కింద ఖర్చు పెట్టాం.
వైసీపీ హయాంలో రూ.15,783 కోట్లు ఖర్చు చేశామని బుగన చెప్పుకొచ్చారు. 2023లో రూ.1,400 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతకు ఒక్క నెలల్లోనే రూ.15 వేల కోట్లు దారాదత్తం చేశారు. గుంటూరులో అంబటికి నిధులు కేటాయించారు. అలాగే ఆగస్టులో రూ.900 కోట్లు, సెప్టెంబర్ లో రూ.1300 కోట్లు ఇచ్చారు. కాంట్రాక్టర్లకు మాత్రేం వేల కోట్లు దోచిపెట్టి ఏం చేశారు. వైసీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండేచర్ ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్ట్ నిర్మించలేదు. ఏంబీఏ చదివి వ్యక్తిని ఆర్థిక శాఖ మంత్రిని చేశారు. ఏం చూసి బుగ్గనను మంత్రిగా చేశారో నాకు అర్థం కావడం లేదు. రెవెన్యూ లోటు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. అప్పులు రూ.45 వేల కోట్లు చేశామని బుగ్గన చెప్పారు.
రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు చేశాం. 2023లో మీరు 4 నెలల్లో రూ.45 వేల కోట్లు అప్పు చేశారు. 2025లో 4 నెలల్లో రూ.48 వేల కోట్లు చేశాం. 3 వేల కోట్లు అదనంగా అప్పు చేశాం. 64 లక్షల మందికి రూ.4 పెన్షన్లు ఇచ్చాం. రూ.2684 కోట్లతో మహిళలకు రాయితీపై ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాం. ఆర్బీఐ లిమిట్స్ తో అప్పు ఎక్కువ చేసుకునే వెసులుబాటు మాకు ఉన్నా తక్కువ అప్పే చేశాం. వైసీపీ హయాంలో పెట్టిన 3 నెలల బకాయిలు కూడా కట్టాం. రూ.10 వేల కోట్లతో తల్లికి వందనం ఇచ్చాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.3173 కోట్లు అందజేశాం.
గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం ఇచ్చాం. 16,437 డీఎస్సీ పోస్టులు భర్తీ చేశాం. వైసీపీ హయాంలో ఒక్క ఉపాధ్యాయుడి పోస్టు అయినా భర్తీ చేశారా?. అర్చకుల వేతనం రూ.15 వేలకు పెంచాం. ఇమామ్, మౌజమ్ లకు గౌవర వేతనం ఇస్తున్నాం. నాయీ బ్రాహ్మణుకలు రూ.25 వేలు, మత్సకారులకు రూ.250 కోట్లు సాయం చేశాం. ఇలా అనేకం చేశాం.
మీరు వేల కోట్లు అప్పులు చేసి ఏం చేశారు. ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక పరిశ్రమను తీసుకురాలేదు. వైసీపీ, సాక్షి పత్రికకు ఆర్థిక అంశాలపై అవగాహన లేదు. కాగ్ నివేదికను తారుమారు చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. ధైర్యం ఉంటే వీధుల్లోకి వచ్చి జనానికి సేవ చేసి మెప్పు పొంది ఓట్లు పొందండి కానీ, ఇలా తప్పుడు విమర్శలు, తప్పుడు కథనాలతో ప్రజల్లో మీరు ఇంకా చులకన అవుతారు. వైసీపీ పాలన కంటే టీడీపీ పాలన చాలా బాగుందని ప్రజలు అంటున్నారు.