– కృష్ణా నది వరద నీరును పరిశీలించిన మంగళగిరి వైసీపీ ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి
గుంటూరు: ఇప్పటికే పైనుంచి వరద నీరు ఐదు లక్షల క్యూసెక్కుల విడుదల చేశారు. మరో రెండు మూడు లక్షల క్యూసెక్కులు వరద నీరు పెరిగితే మహానాడు ప్రాంతంలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విజయవాడ వైపు రిటర్నింగ్ వాల్ కట్టడం జరిగింది.
మహానాడు వైపు కూడా రిటర్నింగ్ వాల్ నిర్మిస్తానని ఎన్నికల సమయంలో, స్థానిక ఎమ్మెల్యే లోకేష్ హామీ ఇచ్చారు . ఎన్నికల్లో ఇచ్చిన హామీ రిటర్నింగ్ వాల్ ను వెంటనే నిర్మించాలి. మహానాడు ప్రాంతంలో దాదాపుగా 6000 పైగా కుటుంబాలు ఉన్నాయి. కృష్ణా నది వరద నీరు వల్ల మహానాడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరగా రిటర్నింగ్ వాల్ ను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం