– వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించండి
– బీసీ గురుకుల పాఠశాలలు , బీసీ హాస్టల్ లలో తాజా పరిస్థితుల పై మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్
– టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ , కమిషనర్ బాల మాయాదేవి , గురుకుల సెక్రెటరీ సైదులు, జాయింట్ సెక్రెటరీలు శ్యామ్ ప్రసాద్, తిరుపతి రెడ్డి
హైదరాబాద్ : భారీ వర్షాలు కుస్తుండటం ,సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో గురుకుల పాఠశాలలు, హాస్టల్ లలో విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండా లి. విద్యార్థులకు విధిగా సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. పాఠశాలలు,హాస్టల్ లలో గడ్డి ,ఇతర బుష్ క్లియరెన్స్ చేయాలి. కీటకాలు రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
తాగునీటి ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి. వంట పత్రాలు శుభ్రంగా ఉంచుకోవాలి. విద్యార్థులకు స్కూల్ యూనిఫాం ,బెల్ట్, సాక్స్,స్పోర్ట్స్ పూర్తి చేయాలి. సరైన సమయంలో పాఠ్యాంశాలు పూర్తి చేయాలి. అన్ని పాఠశాలల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యానని, ఎక్కడైనా ఖాళీలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు