– ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ?
– జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం
– చేవెళ్ల రూరల్ మండలంలో యువ సంకల్ప సభలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు గారు
చేవెళ్ల: రూరల్ మండలంలో యువ సంకల్ప సభను బ్రహ్మాండంగా, పెద్దఎత్తున ఏర్పాటు చేసి యువశక్తిని చాటిన తీరు నిజంగా అద్భుతం. రాజకీయాల్లో యువత పాత్ర ఎప్పటికీ కీలకం. తెలంగాణ ఉద్యమంలోనూ యువత, విద్యార్థులు, న్యాయవాదుల పాత్ర మరువలేనిది. ప్రపంచంలో ఏ ఉద్యమం అయినా యువకులే ముందుకు నడిచారు, నాంది పలికారు.
మన ప్రాంతంలో రాబోయే రోజుల్లో మార్పు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. కొన్ని రాజకీయ కుటుంబాలు తమ కుటుంబ పాలననే నడవాలని భావించి, ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టారు. అనేక ఏళ్లుగా అభివృద్ధి చేయకపోవడం వల్ల ఈ ప్రాంతం వెనుకబాటులో ఉంది. అందుకే యువతలో చైతన్యం రావాలి.
మోదీ ప్రభుత్వం రాకముందు, భారతదేశానికి ఒలింపిక్స్‌లో చాలా తక్కువ పతకాలు వచ్చేవి. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడలను ప్రోత్సహించి, భారత్‌ను విజయ పథంలో నిలిపేందుకు కృషి చేశారు. దేశ యువత జాబ్ సీకర్స్‌గా కాకుండా జాబ్ గివర్స్‌గా ఎదగాలని స్టార్టప్ ఇండియా, ముద్ర లోన్ వంటి పథకాలు ప్రారంభించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసింది. కొన్ని కానిస్టేబుల్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి, లక్ష ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు ప్రచారం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తోంది. నిరుద్యోగ భృతి ఎక్కడ? ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ?
రాష్ట్రంలోని యువత పరిస్థితి భయానకంగా మారింది, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో. డ్రగ్స్ మాఫియా పెరిగింది.శాంతి భద్రతల పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇటువంటి పరిస్థితుల్లో యువతను మంచి దారిలో తీసుకెళ్లే బాధ్యత భారతీయ జనతా పార్టీ యువమోర్చాకు ఉంది. మన లక్ష్యం సామాజిక తెలంగాణను సాధించడం.
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 1000 మంది యువత మార్పు కోసం సంకల్పం తీసుకొని పని చేయాలి. రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకొని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించి బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేయాలి.