– బుదేరా సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను తెలంగాణకే రోల్ మోడల్ గా మారుస్తా
– మునిపల్లి మండలంలో రూ.70 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
– నియోజకవర్గంలో విద్యా, వైద్య, రవాణా సౌకర్యాల మెరుగు కు ప్రత్యేక శ్రద్ధ
– కలెక్టర్ పి.ప్రావీణ్య తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
అందోల్: నియోజకవర్గం లోని మునిపల్లి మండలం బుదేరా లోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పి . ప్రావిణ్య తో కలిసి అందోల్ నియోజకవర్గ పరిధిలోని మండలంలోని వివిధ గ్రామాలలో రూ.70 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బుదేరా సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… అధునాతన సౌకర్యాలతో కూడిన ల్యాబ్ లు, డిజిటల్ తరగతి గదులు, మెరుగైన ఫర్నిచర్, లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కళాశాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం, మండలంలోని కళాశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పాఠశాలలో మౌలిక వసతుల మెరుగుకు కృషి చేయునట్లు తెలిపారు.
గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మంత్రి పరిశీలించారు. వెంటనే భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మునిపల్లి మండలం అల్లాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సంక్షేమ పథకాలు అమలుపై సమీక్ష జరిపి గ్రామస్తులతో మాట్లాడారు.
తాటి పల్లి నుండి మక్తా కేసరం వరకు రెండు వరసల రోడ్డు నిర్మాణం కోసం 22 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసారు . గార్లపల్లి నుండి తక్కడపల్లి వరకు 17. 70 లక్షలతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం , సింగూరు బ్యాక్ వాటర్ ప్రాంతం లో నిర్మించనున్న రిసార్ట్ ప్రాంతాన్ని RDO రవీందర్ రెడ్డి , మండల రెవిన్యూ అధికారులు , గ్రామస్థులతో కలసి పరిశీలించారు .
సింగూరు ప్రాజెక్టు టూరిజం హబ్ గా అభివృద్ధి చెందితే ఎగువ ఉన్న గ్రామాలలో ని యువత కు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు . హైదరాబాద్ కు సమీపం లో అతిపెద్ద జలాశయం సింగూరు కు పర్యాటకులు విరివిగా వస్తారన్నారు . ఈ ప్రాంతం లో రవాణా సౌకర్యాలు పెరిగి భూములకు విలువ పెరుగుతుందన్నారు .
ప్రాజెక్టు ఎగువ ఉన్న తక్కడపల్లి , గార్లపల్లి , చిల్లపల్లి , మక్తకేసారం , బేలూరు , కళ్లపల్లి , లొనికాల్ , హస్నాబాద్ , కోడూరు , మారడగా , ఇప్పడపల్లి , కార్చల్ , ఇందూర్ , సిరోర్ , సింగీతం , తాటిపల్లి లాంటి ప్రాంతాలు అభివృద్ధి లోకి వస్తాయని మంత్రి దామోదర్ రాజనర్సింహా వెల్లడించారు .
త్వరలో సింగూరు ప్రాజెక్ట్ ను టూరిస్ట్ హబ్ గా మార్చనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. మునిపల్లి మండలంలోని గార్లపల్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించిన తర్వాత జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. బుదేరా నుండి సీరూరు వరకు సింగూరు బ్యాక్ వాటర్ వెంట రెండు లైన్ల రోడ్డు ఏర్పాటు కోసం రూ. 60 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా గార్లపల్లిలో హై లెవెల్ వంతెన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ రోడ్డుతో సింగూరు ప్రాజెక్టు వెనుక భాగంలోని రాయికోడ్ మునిపల్లి మండలాలలో గ్రామాలు అభివృద్ధి చెందనున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు కు 100 కిలోమీటర్ల లోపు ఉన్న పెద్ద ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టు అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల చైర్మన్ అంజయ్య, సంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి, పంచాయతీరాజ్ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, ఉపాధ్యాయులు ప్రిన్సిపల్స్, వివిధ శాఖల సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు