హైదరాబాద్: ఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ , ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, లెజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, అధికారులు ఢిల్లీకి వెళ్లారు.
1925 లో భారతదేశ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ గా ఎన్నికైన మొదటి భారతీయుడు కీ.శే విఠల్ బాయి పటేల్ బాధ్యతలు స్వీకరించిన వందేళ్ల సందర్భాన్ని పురస్కరించుకుని ఆగస్టు 24, 25 తేది లలో జరుగుతున్న ఈ ప్రత్యేక సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ శాసనసభ, శాసనపరిషత్ బృందం ఢిల్లీ వెళ్ళింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కంటి శస్త్రచికిత్స జరిగినందువల్ల ఈ సమావేశాలకు హాజరు కావడం లేదు. .