– మంత్రి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
ఆగిరిపల్లి: మండలం, శోభనాపురం గ్రామంలో నిర్వహించిన “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా చీపురు పట్టుకుని ఊడవడం, డ్రైనేజీ పూడికలు తీయడం, అలాగే ఆయిల్ బాల్స్ డ్రైనేజీలో వేయడం వంటి కార్యక్రమాలలో పాల్గొని ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలిపారు. అనంతరం మంత్రి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆజాదీ సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం పరిశుభ్రంగా ఉండడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ద్వారా పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కాకుండా, పట్టణాభివృద్ధి, రోడ్లు, నీటి వసతి, విద్య, ఆరోగ్యం, మహిళల శ్రేయస్సు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు – ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి బాధ్యత” అని మంత్రి అన్నారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందిని సన్మానించి, వారి సేవలను మంత్రి అభినందించారు.