హిహిహ్హి.. ఇంకుడు గుంతలంట. ఇప్పుడు ఇది అవసరమా అని 30 ఏళ్ల క్రితం నవ్వుతూ.. దాని గురించి చెప్పిన ఆయన్ను ఎగతాళి చేశారు.
అప్పుడు మన అజ్ఞానానికి ఆయన నొచ్చుకోలేదు. కనీసం మన మీద జాలి పడడానికి కూడా తన సమయం వృధా చేసుకోలేదు.
నీటి విలువ తెలిసి ఇవ్వాళ ఇలా ఎక్కడ చూసినా తమంతట తాము బోర్ల దగ్గర నుండి అపార్ట్మెంట్ల వరకు, గేటెడ్ కమ్యూనిటీల నుండి పొలాల వరకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొంటున్నారు.
ఇవి చూసి ఆయన నవ్వడం లేదు. ఆయనకు సమయం లేదు. మన అవసరాల కోసం ఇప్పుడు తీరిక లేకుండా.. బనకచర్ల పోలవరం అనుసంధానం అంటున్నాడు. అది అయ్యేదా పొయ్యేదా.. పోలవరం పూర్తి చేస్తే చాలు అయ్యా అని ఆయనను ఎగతాళి చేస్తున్నాం. ఆ దార్శనికుడు చంద్రబాబుకు సమయం లేదు ఇప్పుడు కూడా.. మన మేధావితనం మీద జాలిపడడానికి.