– లీగల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏర్పాటు
– గాంధీభవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: సాధారణ ఎన్నికల ముందు మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి రాగానే కుల సర్వే నిర్వహించాం. ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు సర్వే ద్వారా వచ్చిన వివరాలను శాసనసభలో ప్రవేశపెట్టి రెండు బిల్లులు పాస్ చేశాం.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్, విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లులు ఆమోదింప చేశాం. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ దాటకూడదు అంటూ టిఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన క్యాప్ జీవోను తొలగించేందుకు ఆర్డినెన్స్ సైతం తీసుకువచ్చాము.
బీసీల రిజర్వేషన్ బిల్లు గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. రాష్ట్రపతి దగ్గర కావాలనే ఆలస్యం జరుగుతుంది.
సెప్టెంబర్ 31 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
42 శాతం రిజర్వేషన్ కు సంబంధించి రాష్ట్రపతి నుంచి బిల్లు ఆమోదం పొంది రావాలి, లేదంటే పార్టీ నుంచి 42% రిజర్వేషన్ అమలు చేయాలా? బీసీలకు న్యాయం జరగాలనదే ప్రభుత్వ లక్ష్యం.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్, సెప్టెంబర్ 31 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేయడం ఈ విషయాలన్నీటిపైన లీగల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏర్పాటు చేసి ఈనెల 28 వ తేదీ లోపు నివేదిక తిప్పించుకోవాలని పిఎసి నిర్ణయించింది. లీగల్ ఎక్స్పర్ట్ కమిటీలో సభ్యులు ఇతర వివరాలను పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రకటిస్తారు.
ప్రగతిశీల భావాలు కలిగిన ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు, ఓటు హక్కు కలిగిన ప్రజాప్రతినిధులు సహకరించాలి.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తెలుగు వ్యక్తి.
గొప్ప వ్యక్తిని ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో దించడంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి హర్షం వ్యక్తం చేశాం. సుదర్శన్ రెడ్డి హైకోర్టు జడ్జిగా అస్సాం చీఫ్ జస్టిస్ గా సుప్రీంకోర్టు జడ్జిగా ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని కాపాడేలా తీర్పులు వెలువరించారు. దేశ ప్రజల హక్కులు కాపాడేందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి చారిత్రాత్మక తీర్పులు వెలువరించారు
ఓట్ చోరీకి వ్యతిరేకంగా బీహార్లో దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా ఈనెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సహచరులు, పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేతలు బీహార్ కు వెళ్లాలని పీఏసీలో నిర్ణయం జరిగింది.
దేశంలో ఓటు చోరీకి గురవుతుంది తద్వారా బిజెపి లబ్ధి పొందుతుంది, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వారికి సంబంధించిన వ్యక్తులు ఎన్నికల కమిషన్ను ప్రభావితం చేస్తున్నారు అని ఉదాహరణలతో కూడిన వీడియోను ఈ దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలందరికీ వివరించారు.
విద్యార్థి దశ నుంచి అంతిమ దశ వరకు వామపక్ష భావజాలంతో పనిచేసిన సురవరం సుధాకర్ రెడ్డి మన మధ్య లేకపోవడం పై పిఎసి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని తీర్మానం చేసింది. విద్యార్థి నాయకుని దశ నుంచి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన దేశానికి చేసిన సేవలను పిఎసి కొనియాడింది. రేపు ఉదయం మగ్దూం భవన్లో సుధాకర్ రెడ్డి పార్దివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు క్యాబినెట్ సహచరులు నివాళులు అర్పించనున్నారు.