రాహుల్ గాంధీ బిజెపి ‘ఓట్ చోరీ’ చేసి గెలించింది అంటూ ఒక అబద్ధపు మాట పట్టుకుని తెగ ప్రచారం చేస్తున్నాడు.
వేరే వేరు పోలింగ్ బూత్ లలో వేరే వేరే ఊర్లలో లేదా రాష్ట్రాల్లో ఒక ఓటర్ కే ఒకటి కంటే డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి అని చెప్పడం వరకు తప్పు కాదు, ఇలా జరుగుతోంది అని సామాన్య జనాలకు కూడా దశాబ్దాలుగా తెలుసు. కానీ, ఇది కావాలని EC మరియు కేంద్ర ప్రభుత్వం లేదా బిజెపి కుమ్మక్కు అయి చేసిన ఫ్రాడ్ అంటూ.. అంతర్జాతీయ స్థాయిలో తన ముఠా ద్వారా ప్రచారం చేయడం.. దేశ వ్యవస్థలను అవమానించడం.. దేశాన్ని అస్థిర పరచాలనే అంతర్జాతీయ కుట్రలో భాగస్వామ్యం కావడమే. ఓటర్ లిస్ట్ లో తేడాలు అదేదో నిజంగా ఫ్రాడ్ అనే లెవెల్ లో నెహ్రూ కుటుంబ బానిసలు దానికి వీర ప్రచారం కల్పిస్తున్నారు.
కాంగ్రెస్ హయాంలో ఎన్నికల సంఘం పరిస్థితి చూడండి. ప్రధాని ఎవరి పేరు సూచిస్తే వారే ఎన్నికల అధికారి అయ్యేవారు. శేషన్ రాక ముందే 1989లో పేరి శాస్త్రి అనే ఎన్నికల కమిషనర్ వచ్చారు. అప్పుడు రాహుల్ నాన్న రాజీవ్ ప్రధాని. పేరి శాస్త్రి కూడా శేషన్ లాగే బాగా ముక్కుసూటి మనిషి. ప్రభుత్వానికి లొంగ లేదు. ఒక్క అధికారికి ప్రభుత్వాన్ని శాసించే అధికారం ఉండటం ఏమిటి? అని భావించిన రాజీవ్ ఈ ఎన్నికల కమిషనర్ అధికారాలకు చెక్ పెట్టడానికి మొదటి సారిగా ఒక ఎన్నికల కమిషనర్ స్థానంలో ముగ్గురు ఎన్నికల కమిషనర్ పోస్ట్స్ తయారుచేశాడు.
అయితే, ఎవరి బాధ్యతలు ఏమిటీ అనేది సరిగా నిర్వచించకపోవడం తో వాళ్ళల్లో వాళ్లకు అభిప్రాయ బేధాలు రావడంతో మళ్ళి 1990లో ముగ్గురు EC లు పద్దతి రద్దు చేసి, మళ్ళీ ఒకే EC గా మార్చారు. 1993లో పివి నర్సింహారావు ప్రధాని గా ఉండగా మళ్ళీ ముగ్గురు EC లను చేశారు. అంటే కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ తో ఎలా అడుకుందో చూడండి. 1990లో శేషన్ ఎన్నికల కమిషనర్ గా రావడం, ఆపై 1993లో ఓటర్ గుర్తింపు కార్డ్ లు రావడం కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ మీద పెద్ద ప్రభావం చూపించాయి.
ఇక అసలు ఫోటో ఓటర్ ఐడి కార్డులు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఒక ఓటర్ తన గుర్తింపు చూపించుకోడానికి, ఒక ఓటర్ ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయకుండా ఉండటానికి. ఈ ఓటర్ ఐడి కార్డ్స్ ప్రవేశపెట్టడానికి 1958లోనే బిల్లు తెచ్చారు కానీ దానిని అమలు చేయలేదు. చివరకు 1993 లో మొదట సారిగా ఓటర్ ఐడి కార్డ్స్ ప్రవేశపెట్టారు.
అంతకు ముందు ఒక ఓటరు దేశంలో వేరే వేరే పోలింగ్ బూత్ లలో పేరు నమోదు చేయించుకుని ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేసే అవకాశం చాలా ఎక్కువగా ఉండేది. అలాగే గుర్తింపు కార్డ్ లేకపోతె ఓటర్ నిజంగా తన ఓట్ వేస్తున్నాడా లేదా ఇతరుల బదులు ఇతను ఓటు వేస్తున్నాడా అనేది కూడా గుర్తించడం చాలా కష్టంగా ఉండేది.
ఇప్పుడు ఎన్నికల కమిషన్ ని తప్పు పట్టడం, ఓట్ చోరీ అంటూ రాహుల్ మాట్లాడటం…
దేని కోసమో వెళ్తే…ఏదో బయట పడింది..
అని ఒక ముతక సామెత లో చెప్పినట్లుగా..
రాహుల్ బిజెపి మీద చేత్తో బురద జల్లుదామని అనుకుంటే తన నాన్న, నాయనమ్మ ముత్తాత మీద బక్కెట్ల తో పెంట పోయించుకుంటున్నాడు.
ఎందుకు? ఎలా?
స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి 1993 వరకు అర్హులైన ఓటర్లను గుర్తించడానికి ఓటర్ గుర్తింపు కార్డులు లేవు. అంటే ఎవడి ఓటు ఎవడైనా ఎక్కడైనా వేసేయ్యవచ్చు.
అంటే, 1993 వరకు అటువంటి ఓటింగ్ పరిస్థితులు ఉన్న కాలంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ కాలం కేంద్రంలో అధికారం లో ఉన్న నెహ్రూ కుటుంబ కాంగ్రెస్ నిజంగా “ఓట్ చోరీ” లేదా బూత్ క్యాప్చరింగ్ వంటివి చేసి ఎన్నికలు గెలిచారు అని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే, 1993లో ఓటర్ ఐడీ కార్డ్స్ పెట్టి ఎన్నికలు కాస్త పద్దతి ప్రకారం జరగడం మొదలు అయిన తరువాత నుండి జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి కనీసం సాధారణ మెజార్టీ కూడా రాలేదు. కాంగ్రెస్ 7 ఎన్నికలలో మెజారిటీని గెలిచింది. తరువాత 1993లో భారతదేశంలో ఓటర్ ID కార్డులు పరిచయం చేయబడ్డాక కాంగ్రెస్ కి స్వంతం గా మెజారిటీ రాలేదు.
ఈ డేటా చూడండి:
1952: 364 సీట్లు
1957: 371 సీట్లు
1962: 361 సీట్లు
1967: 283 సీట్లు
1971: 352 సీట్లు
1980: 353 సీట్లు
1984: 404 సీట్లు
1993 తరువాత జరిగిన ఏ ఎన్నికలలోనూ కాంగ్రెస్ మెజారిటీని పొందలేదు:
1996: 140 సీట్లు
1998: 141 సీట్లు
1999: 114 సీట్లు
2004: 145 సీట్లు (UPA కూటమి ద్వారా అధికారంలోకి)
2009: 206 సీట్లు (UPA కూటమి నేతృత్వం)
2014: 44 సీట్లు
2019: 52 సీట్లు
2024: 99 సీట్లు (INDIA కూటమి భాగం)
వికి ప్రకారం 1993లో T.N. సేషన్ CEC గా ఓటర్ ID ని పరిచయం చేశాక కాంగ్రెస్ ఎన్నికల రాత మారిపోయింది. 1989లో ప్రాతినిధ్య హక్కుల చట్టంలో సవరణ చేసి బూత్ క్యాప్చరింగ్ను నేరంగా ప్రకటించబడింది, 2000 నుండి EVMs పరిచయం బూత్ కేప్చురింగ్ ని మరింత తగ్గించింది.
అంటే కాంగ్రెస్ విజయం 1990లో శేషన్ వంటి గట్టి CEC రావడం, 1993 తరువాత ఓటర్ IDలు ప్రవేశపెట్టడంతో ఆగిపోయిందని, ఆపై ఈవీఎంలు పెట్టడంతో మరింత తగ్గిపోవడం వంటి పరిస్థితులు చూస్తుంటే 1993 ముందు ఎన్నికల గెలుపుకు కాంగ్రెస్ అవలంబించిన పద్దతులపై అనుమానాలు రేకెత్తిస్తాయి.
రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ మేం ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే EVM లను నమ్మం అని పదే పదే గోల చేస్తూ పేపర్ బాలెట్ లు మళ్ళీ ఎందుకు ప్రవేశపెట్టమంటోందో అర్ధం అయిందా?
సో మొత్తం మీద రాహుల్ తమ పార్టీ కప్పెట్టెసిన పాత చరిత్ర అంతా తవ్వి బయటకు పోయడానికి ప్రత్యర్ధులకు బాగా సహకరిస్తున్నాడు.
కొస మెరుపు: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం కుమ్మక్కు అని రాహుల్ ఆరోపిస్తున్నాడు. కానీ స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఎన్నికల సంఘం ఎప్పుడూ ప్రభుత్వ విభాగం లాగే ఉండి ప్రధాని ఎలా చెప్తే అలా నడిచేది. ఈ మాట వేరే ఎవరో చెప్పలేదు. ఎన్నికల కమిషనర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న TN శేషన్ ఈ మాట చెప్పారు ఒక విడియోలో.
ఆయన మాటల్లోనే ‘ అప్పట్లో ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ తొత్తుగా ఉండేది. నాకు ఇప్పటికి గుర్తు, నేను కేబినెట్ సెక్రటరీ గా ఉండగా ప్రధాని ఫోన్ చేసి (అంటే రాజీవ్ గాంధీ) ఎన్నికలు ఫలానా లాగా ఫలానా అప్పుడు పెట్టమని ఎన్నికల సంఘానికి చెప్పండి అని చెప్తే, అది పద్దతి కాదు మేం రెడీగా ఉన్నాం ఎన్నికలు జరిపించాలని ఎన్నికల సంఘానికి చెప్పాలి, ఎన్నికలు ఎప్పుడు ఎలా అనేది ఎన్నికల సంఘం చూసుకుంటుంది” అని చెప్పాను అని శేషన్ చెప్పారు.
– చాడా శాస్త్రి