– మన విద్యావ్యవస్థ అదృష్టం చేసుకుందా?
విద్య అనేది రాష్ట్ర అభివృద్ధికి పునాది. జ్ఞానం మాత్రమే కాదు — నైపుణ్యం, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, పౌర చైతన్యం, సామాజిక సమైక్యత… ఇవన్నీ విద్య ద్వారానే సాధ్యం
విద్యతో..
– అధిక ఉత్పాదకత
– కొత్త ఆవిష్కరణలు
– స్వయం ఉపాధి
– పెట్టుబడుల ఆకర్షణ
– పేదరిక నిర్మూలన
– నేరాల తగ్గుదల
– ప్రజాస్వామ్యంపై అవగాహన
– ఆరోగ్యకరమైన అలవాట్లు
– సమాజంలో సామరస్యం
ఇలా ఎన్నో ఒక రాష్ట్రం సాధించగలదు.
కేవలం విద్య ఒక వ్యవస్థ కాదు — అది రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం.
మన విద్యావ్యవస్థ అదృష్టం చేసుకొందా?
పదహారు వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలతో విలపిస్తున్న సరస్వతీ నిలయాల దురావస్థ నుండి వివేకం, ఉన్నత విద్య, సౌమ్యుడు, సహనం కల దూరదృష్టి కలిగిన నాయకుడు మాత్రమే కాపాడగలడు.
అలాంటి లక్షణాలు గల లోకేశ్ మంత్రిగా దొరకడం, మన విద్యావ్యవస్థ చేసుకున్న అదృష్టం.
డేటా ఆధారిత నిర్ణయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు , ప్రపంచ అవసరాలకు అనుగుణంగా.. పోటీగా సంస్కరణలు, అలుపెరగని శ్రమ, అమలు చేయగల సమర్థతతో.. విద్యా రంగంలో నిత్యం సంస్కరణలు తెస్తూ చకచకా అమలు చేయిస్తున్నారు.
ఏడాదిలోనే కోర్టుకు వెళ్లిన సమస్యలు కొలిక్కి తెచ్చి మెగా DSC ద్వారా 16,000+ ఖాళీల భర్తీ చేస్తున్నారు.
ప్రపంచ అవసరాలకు తగ్గ సిలబస్, కోర్సుల్లో ప్రక్షాళన మొదలెట్టారు.
ప్రభుత్వ పరంగా ఒకరికి పైగా ఒక కుటుంబంలో పిల్లలు వుంటే వివక్ష తొలగించి ఎంతమంది వున్నా.. అందరికీ తల్లికివందనం అమలు చేశారు.
మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచి ఇంటర్మీడియట్ వరకు విస్తరించారు.
తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులు, ప్రోగ్రెస్ కార్డు, రియల్ టైం ట్రాకింగ్ సంస్కరణలు తెచ్చారు.
మరోవైపు నైపుణ్యాభివృద్ధి పెంచడానికి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని, అమలయ్యేలా చేస్తున్నారు.
ఇంటింటా చదువు–నైపుణ్యాల మ్యాపింగ్ చేసి, ఇండస్ట్రీ అవసరాలకు అనుసంధానం చేస్తూ.. మన మానవ వనరుల ప్రత్యేక సామర్థ్యాలకు తగ్గట్టుగా పెట్టుబడుల కోసం కూడా మరోవైపు శ్రమిస్తున్నారు.
పాఠ్యపుస్తకాల అట్టల మీద క్రిమినల్స్ చిత్రాల బదులు గురు పూజోత్సవం జరుపుకొనే సర్వేపల్లి రాధాకృష్ణ గారి లాంటి మహోన్నతుల చిత్రాలు పెట్టించి, బెల్టు నుండి సంచి వరకు ఆత్మగౌరవంతో పిల్లలు బడికి వెళ్లేలా మరెన్నో సంస్కరణలు తీసుకువచ్చారు.
తెలుగు రాష్ట్రాల చరిత్రలో మొట్టమొదటిసారి విద్యా వ్యవస్థకు అదృష్టం పట్టింది. లోకేశ్ దూరదృష్టితో కూడిన నాయకత్వం మరియు అలుపెరగని కృషి, రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయి.