– బీసీల పేరు చెప్పి మీరు ఓట్లు అడుక్కోవడం లేదా?
– దమ్ముంటే తెలంగాణలో దొంగ ఓట్ల లెక్కలు తేల్చండి
– గతంలో 60 ఏళ్ళు ఏలిన కాంగ్రెస్ దొంగ ఓట్లతోనే గెలిచిందా?
– పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు బిజెపి ఎంపీ డీకే అరుణ సవాల్
హైదరాబాద్: మహేష్ కుమార్ కు మతి భ్రమించి, అధికారహంకారంతో మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే తెలంగాణాలో దొంగ ఓట్లను ఏరండి. అప్పుడు దొంగలేవరో, దోషులవరో తేలిపోతుంది కదా? ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్డ్ పార్టీ మనుగడ కోసం దొంగ ఓట్ల రాగం అందుకుంది.
ఇక్కడ దొంగ ఓట్లు ఉంటే, మీరు కూడా దొంగ ఓట్లతో గెలిచినట్లే. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లున్నది కాంగ్రెస్ వాలకం. మీకు సాధ్యమైతే తెలంగాణాలో దొంగ ఓట్ల లెక్కలు తేల్చాలి. స్థానిక సంస్థల ఎన్నికలస్తున్నాయి కదా. ఆలోపు బోగస్ ఓట్ల గుట్టు విప్పాలి.
తెలంగాణాలో దొంగ ఓట్లు ఉన్నాయి అని బిజెపి ముందే చెప్పింది. ఎన్నికలకు ముందే ఓట్ల- నోట్ల లెక్కలు తేలాలి. మొన్న కర్ణాటక మినిస్టర్ ఇంట్లో దొరికిన వాటి గురించి ఎందుకు నోరు మెదపరు? ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయి మతి భ్రమించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అటు రేవంత్ రెడ్డీ, ఇటు ఇంచార్జ్ మీనాక్షి మధ్య నలిగిపోతున్నాడు. అందుకే ఏం మాట్లాడుతున్నాడో మహేష్ కు తెలియడం లేదు
దేవుని పేరు చెప్తే తప్పా? దేవుడు, ధర్మం గురించి మాట్లాడితే తప్ప? బిచ్చం అడుక్కున్నట్లా? మీరు దేవుళ్ళ గురించి మాట్లాడకండి. ధర్మం గురించి మాట్లాడకండి. మీరు ఇంకేదైనా మాట్లాడండి. దేవుళ్ళ గురించి మాట్లాడితే బిచ్చగాళ్లు అనడం ప్రజల మనోభావాలు దెబ్బ తీయడం కాదా?
ఇలాంటి పిచ్చి మాటలు మానుకోకపోతే మీకు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఖబర్ధార్. మీరు కాపీ బ్యాచ్. మేము మాట్లాడేది కాపీ కొట్టే మీరా మాకు నీతులు చెప్పేది? మోదీ మాట్లాడే ప్రతి మాటను కాపీ కొట్టేది మీరు. రోజు మోదీ మాటలు కాపీ కొట్టి రాజకీయం చేసే మీరా మా గురించి మాట్లాడేది?
కాంగ్రెస్ అంటేనే కుల రాజకీయం. మీకు కులం పేరు చెప్పకుండా ఓట్లడిగే దమ్ముందా? మాట్లాడితే బీసీలకు 42% రిజర్వేషన్ లు అంటున్నారు కదా? మహేష్ కుమార్ ముందు ని పార్టీ లో నువ్ సీఎం పదవి తెచ్చుకో. చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయు. బీసీ ల పేరు చెప్పి మీరు అడుక్కోవడం లేదా ఓట్లు? ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన మీరు మతి భ్రమించి బిజెపి పై అవకులు చవాకులు పేలుతున్నారు.
దేశంలో బిజెపి కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ విమర్శలు. గతంలో తాము చేసిన పనే అందరూ చేస్తారనుకోవడం సిగ్గు చేటు. గతంలో 60 ఏళ్ళు ఏలిన కాంగ్రెస్ దొంగ ఓట్లతోనే గెలిచిందా? వారు చేసినట్లే అందరు చేస్తాం అనుకోవడం కరెక్ట్ కాదు కదా? ఒక జాతీయ పార్టీ గా కాంగ్రెస్ పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. మనుగడ కోసమే బిజెపి పై కాంగ్రెస్ దుష్ప్రచారం