– నెల్లూరులో అట్టహాసంగా ఏఎంసీ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం
– నూతన కమిటీ చైర్మన్, సభ్యులను అభినందించిన మంత్రి పొంగూరు నారాయణ
నెల్లూరు: జిల్లా, అగ్రికల్చర్ మార్కెటింగ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం నెల్లూరు మాగుంట లేఔట్ లోని పిచ్చిరెడ్డి కల్యాణ మండపంలో అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. మంత్రితో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జనసేన నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నెల్లూరు మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ గా మనుబోలు శ్రీధర్ రెడ్డి, వైస్ ఛైర్మన్గా రాపూరు చంద్రశేఖర్ లతో పాటు మరో 13 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఏఎంసీ నూతన చైర్మన్, డైరెక్టర్లను మంత్రి నారాయణ అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు.
నెల్లూరు మార్కెటింగ్ కమిటీ లాభదాయకంగా ఉండేందుకు కృషి చేయాలని సూచించారు. కష్టం చేసిన ప్రతిఒక్కరికి ఎప్పటికైనా మంచి రోజులు ఉంటాయని మంత్రి భరోసా ఇచ్చారు. 1971 లో మార్కెటింగ్ కమిటీ తొలిసారి ఏర్పడిందని గుర్తు చేశారు. నూతన కమిటీ రైతులు, వ్యాపారులకు అనుసంధానంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలను ఛేదించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని స్పష్టం చేశారు. మానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.20 వేలు ఇవ్వబోతున్నట్టు తెలియజేశారు. ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ అమలు చేశామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పు తీరుస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోందన్నారు.
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పారిశ్రామిక వేత్తలు వెళ్లిపోయారని, అయితే నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ కృషిచేస్తున్నారని భరోసా ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నామన్నారు. ముఖ్యమంత్రి అపార అనుభవంతో ఆర్థిక పరిస్థితులు గాడిలో పడుతున్నాయని భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఆపేసిన అమృత్ స్కీమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసి అందరి మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. జిల్లా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ సభ్యులు రైతుల అభిమానాన్ని పొందాలని సూచించారు.
అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. టీడీపీ నేత విజయ భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, క్లస్టర్ ఇంచార్జులు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు