– ఏలూరు డి ఎస్ పి శ్రవణ్ కుమార్ ని కలిసిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్
ఏలూరు: కైకలూరు కాపు కుటుంబం పై దాడి జరిపిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలనీ రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు డి యస్ పి శ్రవణ్ కుమార్ ను కలిసిన జేఏసీ ప్రతినిధి బృందం ఏలూరు నుండి.. కైకలూరు మార్గమధ్యంలో ఏ వీ శ్రీనివాస్ తనయుడు వెంకట రాజేష్ పై జరిగిన రాళ్ల దాడి పై సమగ్ర విచారణ జరిపించి, నేరస్థులను అరెస్ట్ చేయాలని డి ఎస్ పి శ్రవణ్ కుమార్ ను కోరారు. జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ వెంట జేఏసీ నాయకులు ఆకుల శ్రీనివాస్, మార్కండేయలు, రాజనాల రామ్ మోహన రావు పాల్గొన్నారు.