– సీఎం పాత పద్ధతుల్లో రోత మాటలు
– మంత్రులు రివ్యూ చేయాలనే సోయి లేదు
– మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
నల్లగొండ జిల్లా: అసెంబ్లీ సమావేశంలో తమ సమస్యలను లేవనెత్తాలని ప్రజలు బీఆర్ఎస్ తలుపు తడుతున్నారు. ఉద్యోగులు భృతి కోసం, నిరుద్యోగులు జాబ్ క్యాలండర్ కోసం, విద్యార్థినులు స్కూటీ కోసం, రైతులు రుణమాఫీ, రైతు భరోసా, యూరియా, కరెంటు కోతలపై మమ్ములను అడగమని అంటున్నారు.
వరదలపై ప్రభుత్వానికి సోయి లేదు. సీఎం పాత పద్ధతుల్లో రోత మాటలు.. మంత్రులు రివ్యూ చేయాలనే సోయి లేదు. గోదావరి, కృష్ణాలో వందలాది TMC నీరు సముద్రంలో కలుస్తుంది. జిల్లా కేంద్రంలోని ఉదయసముద్రంలో నీరు లేదు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి కి సోయి లేదు. ఓ వైపు వర్షాలు… మరోవైపు యూరియా కోసం రైతుల పడిగాపులు.
కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో పెడితే మాకేం ఇబ్బంది లేదు. అసలు నివేదికను బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. స్థానిక సంస్థల పేరుతో కాంగ్రెస్ మోసం బైట పడింది.. మరో డ్రామాకు తెర తీస్తుంది. హైకోర్టు మూడు నెలల టైమ్ ఇస్తే.. రెండు నెలలు నిద్రపోయి, ఇప్పుడు హడావుడి చేస్తుంది. ఎన్నికల కమిషన్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది.
ఓ వైపు వర్షాలు, వరదలు వస్తుంటే సమగ్రంగా లేని ఓటర్ లిస్టు లు పెట్టి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. అన్ని ఓటర్ లిస్టు లను గ్రామాల్లో బహిరంగపర్చాలి. అందరి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి.