– మోదీకి రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే
– సికింద్రాబాద్ బీజేపీ ఇన్చార్జి మేకల సారంగపాణి
– రాహుల్ దిష్టిబొమ్మ దగ్ధం
సికింద్రాబాద్: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని మోడీ మాతృ మూర్తిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని సికింద్రాబాద్ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వ్యాఖ్యలకు నిరసనగా సికింద్రాబాద్ బీజేపీ ఇంచార్జ్ మేకల సారంగపాణి ఆధ్వర్యంలో నేతలు శనివారం తార్నాకలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు.
తార్నాక చౌరస్తాలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెద్ద ఎత్తున పాల్గొన్న బీజేపీ శ్రేణులు రాహుల్ గాంధీకి, కాంగ్రేస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓయూ పోలీసులు ఆందోళన కారులను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత్ ను అగ్రభాగంలో నిరంతరం కృషి చేస్తున్న మహానాయకుడు నరేంద్రమోదీ అని తెలిపారు.
ప్రపంచమే విశ్వగురువుగా భారత్ ను ప్రస్తుతిస్తుంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు ఉత్తర ప్రదేశ్, బీహార్ లో తిరుగుతూ తొలంగించిన రోహింగ్యాల ఓట్ల కోసం పోరాటం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ ఉగ్రముఠాలను తుదముట్టించడమే కాకుండా ఆ దేశాన్ని గడగడలాడించిన భారత సైన్యం యొక్క వీరోచిత పోరాటాన్ని కూడా ఆవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని పేర్కొన్నారు.
ఇప్పటికైనా తమ తప్పులు తెలుసుకొని భారత ప్రభుత్వానికి, మోడీకి, దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని యెడల కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు మరింత ఘటగా బుద్ధి చెప్పడం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క హామీని కూడా పూర్తి చేయలేని ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కనకట్ల హరి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు రాచమల్ల కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి మలికంటి వీరన్న, జిల్లా కార్యదర్శి ప్రకాష్ గౌడ్, కన్నాభిరామ్, పోచయ్య యాదవ్, ప్రభు గుప్తా, డివిజన్ అధ్యక్షుడు ఉపేందర్ యాదవ్, శారదా మల్లేష్ కరుణాకర్, ఆకుల శ్రీనివాస్, గణేష్ ముదిరాజ్, ఆకారం రమేష్, నీలం శ్రీనివాస్ ముదిరాజ్, అనిత, అనుష తదితరులు పాల్గొన్నారు.