– సీపీఎస్ ఉద్యమానికి నా మద్దతు
– మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం
– ఒపీఎస్ కోసం ప్రభుత్వాన్ని ఒప్పిద్దాము
– ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
– సెప్టెంబర్ 1వ తేదీ ఉద్యోగుల కు విద్రోహ దినం
– తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి
– పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నేటికి పాత పెన్షన్ విధానమే
– తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు కె.రామకృష్ణ
హైదరాబాద్: పెన్షన్ ప్రాథమిక హక్కు అని ఇటీవల సుప్రీం కోర్టు తన తీర్పులో వెల్లడించింది. గౌరవ ప్రదంగా జీవించే హక్కులో భాగమే పెన్షన్. ఇందులో కీలకమైన అంశాలు. పిక్స్ డ్ పెన్షన్, పిక్స్ డ్ పే మెంట్ వంటి మౌలిక తేడాలున్నాయి. మార్కెట్ లోని ఆటుపోట్లను బట్టి మన పెన్షన్ పై గ్యారెంటీ లేదు.
ఉద్యోగి పెన్షన్ పెట్టుబడిదారుల చేతిలో ఉంది. పెన్షన్ ను ఒక హక్కుగా ప్రభుత్వం గుర్తించాలి. ఈ సభలోని అంశాలను ప్రభుత్వానికి చేర్చుతాను. ఇప్పటికే గతంలో చీఫ్ సెక్రటరీ కి ఓ నివేదిక సమర్పించడం జరిగింది. మన సమస్యపై కసరత్తు చేయాలి. ప్రభుత్వం పై పడుతున్న భారం పై కసరత్తు చేయాలి. సీపీఎస్ ఉద్యమానికి నా వంతు మద్దతు ఉంటుంది.
సీపీఎస్ రద్దు కోసం పోరాడుదాం: ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
ఈ సమస్య పై ఇప్పటికే గవర్నర్ తో పాటు అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి వినతులు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2014లో నూతన పెన్షన్ విధానం కు ఒప్పుకోవడం వలన సీపీఎస్ అమలు జరుగుతుంది. నాకు ఓట్లు వేసి గెలిచిన ఉపాద్యాయులకు రుణపడి ఉంటాను. మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఒపీఎస్ కోసం ప్రభుత్వాన్ని ఒప్పిద్దాము. లేదంటే సీపీఎస్ రద్దు కోసం పోరాడుదాం.
ఉద్యోగికి పెన్షన్ భిక్ష కాదు: ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అశ్వద్దామ రెడ్డి
ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సీపీఎస్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలి. ఉద్యోగికి పెన్షన్ భిక్ష కాదు, హక్కు. పీఆర్పీ, డీఏ లు పెండింగ్ లోనే ఉన్నాయి.
ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి
సెప్టెంబర్ 1వ తేదీ ఉద్యోగుల కు విద్రోహ దినం. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు శాపంగా మారింది.ఉద్యోగులకు పెన్షన్ భిక్ష కాదు కనీస హక్కు. సీపీఎస్ ను రద్దు చేసి ఒపీఎస్ విధానాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
సీపీఎస్ లో లోపాలు ఉన్నాయి కాబట్టి యూపీఎస్ ను తీసుకువచ్చారు. అనేక క్లిష్ట పరిస్థితులను పరిష్కరిస్తున్న సీఎం ఓపీఎస్ ను కూడా అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఒపీఎస్ అమలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఇదే సెప్టెంబర్ 1వ తేదీ సీపీఎస్ ఉద్యోగుల కు చివరి విద్రోహ దినం కావాలి. సీఎం మన సమస్యను మానవీయ కోణంలో పరిష్కరిస్తోందని నమ్మకం ఉంది. రెవెన్యూ శాఖకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చినట్లుగానే సీపీఎస్ ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్న.
ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతుతో తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేసిన పాత పెన్షన్ సాధనకై సి.పి.ఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభను నిర్వహించడం జరిగింది. దీంతో 2004 సెప్టెంబర్ 1 తరువాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సి.పి.ఎస్ విధానాన్ని వర్తింపచేయడం జరిగింది. దీంతో ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ సౌకర్యం లేక వృద్దాప్యంలో ఆర్ధిక, అనారోగ్య సమస్యలతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
ఏకీకృత పెన్షన్ విధానాన్ని తిరస్కరించాలి: తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు కె.రామకృష్ణ
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతి పాదించిన ఏకీకృత పెన్షన్ విధానాన్ని (UPS) నిర్ద్వందంగా రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1980 పెన్షన్ రూల్ ప్రకారం పాత పెన్షన్ పునరుద్ధరణ చేసి ఉద్యోగుల ఆత్మగౌరవం ను కాపాడాలి. ఉద్యోగి కాంట్రిబ్యూషన్ లేకుండానే పదవి విరమణ తర్వాత సర్వీస్ ను బట్టి పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఉద్యోగంలో వుండి చనిపోయిన లేదా పదవి విరమణ తర్వాత చనిపోయిన కూడా ఫ్యామిలీ పెన్షన్ అవకాశం ఉంటుంది.
షేర్ మార్కెట్ ఒడిదుడుకుల మీద ఆధారపడి పెన్షన్ ఇవ్వడమన్నది ఎండమావిలో నీటిని వెతకడమే అవుతుంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ ను కేంద్ర ఉద్యోగుల సంఘం, అన్ని రాష్ట్రాల ఉద్యోగ సంఘాలు మరియు పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం దేశ వ్యాప్త పోరాటానికి కార్యాచరణ ప్రకటించారు.
ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక భద్రత ఉంటేనే వృద్దాప్యంలో వారు ఆత్మ గౌరవంతో జీవిస్తారు. పాత పెన్షన్ ప్రకటన కోసం రెండున్నర లక్షల పై చిలుకు ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నేటికి పాత పెన్షన్ విధానమే కొనసాగుతుంది. అలాగే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ,జార్ఖండ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సి.పి.ఎస్ విధానాన్ని రద్దు చేసి ఒపీఎస్ విధానం ను అమలు చేస్తున్నారు.
తమిళనాడు, కర్ణాటక ,పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు పాత పెన్షన్ పునరుద్ధరణకు సిద్దమవుతున్నాయి.
తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎల్. దర్శన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేఏసీ కో- ఛైర్మన్, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం జనరల్ సెక్రటరీ తెలంగాణ CPS ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు కె. రామకృష్ణ, జనరల్ నాగవల్లి ఉపేందర్, ఎస్.రాములు, రాధ, ఎం. శ్రీనివాస్ శంకర్, కె.హన్మంత్ రావు, దేవేందర్, జి.కృపాకర్, కె. రాములు, బాణాల రాంరెడ్డి, పాక రమేష్, డా.జి. నిర్మల, అశ్వధామారెడ్డి, డా. కత్తి జనార్ధన్, హబీబ్ మస్తాన్, గరికే ఉపేందర్ రావు, ఎస్.వి. సుబ్బయ్య, మహిపాల్ రెడ్డి, ఊదరి గోపాల్, పీహెచ్. రవి, ఎస్. నర్సింలు, రొక్కం దేవిక, బి. సుదర్శన్ గౌడ్, ఎం. చంద్ర శేఖర్ గౌడ్, కొంగల వెంకట్, కె. సాయిరెడ్డి, పి. లక్ష్మయ్య, ఎస్. నర్సింలు, ఆవుల సైదులు, రాందాస్, డా. రామకృష్ణ, ఎస్. హరి కిషన్, కె. సందీప్ కుమార్, మహమ్మద్ మోహినుద్దిన్, ఆర్. కిరణ్ కుమార్, శ్రీకాంత్, హేమలత, జి. మహేష్ కుమార్, సుగంధిని, రాంబాబు, చైతన్య క్రిష్ణ, మల్లేశం, రాందాస్ శోభన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.