– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా పోయిందని చంద్రబాబు కంటే రేవంత్ రెడ్డినే ఎక్కువగా బాధపడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డివ్యంగాస్త్రాలు సంధించారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాడారో, ఇప్పుడు అదే పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి టీడీపీ కోసం ఎందుకు ఆరాటపడుతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈటల రాజేందర్ పార్టీని వీడటంలో హరీశ్ రావు పాత్ర ఉందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. నిజానికి ఈటలను బీఆర్ఎస్లోకి తీసుకురావడానికి కారణం నేనే. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవడంలో హరీశ్‌కు ఎలాంటి సంబంధం లేదు అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రజాభిమానం పొందడంలో, ప్రజల కోసం పనిచేయడంలో హరీశ్ రావును చూసి నేర్చుకోవాలని, అందుకే వయసులో తమ్ముడైనా దక్షతలో తనకంటే అన్నలాంటివాడని చాలాసార్లు చెప్పానని గుర్తు చేశారు.